Naralokesh, TDP, Telangana, AP, Telugudesamparty, Chandrababu naidu

Nara lokesh said that he will avail for telangana and andhrapradesh karyakarthas

Naralokesh, TDP, Telangana, AP, Telugudesamparty, Chandrababu naidu

Nara Lokesh said that he will avail for telangana and andhrapradesh karyakarthas. He will spent fifteen days in telangana and fifteen days in ap.

నారా లోకేష్ ఇక అందరివాడు

Posted: 07/02/2015 12:58 PM IST
Nara lokesh said that he will avail for telangana and andhrapradesh karyakarthas

ఏపి సిఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఇక మీదట అందరి వాడుగా మారనున్నారు. అదేంటి అందరి వాడు చిరంజీవి కదా అనుకుంటున్నారేమో కానీ అది సినిమా.. ఇది రాజకీయ సినిమా. అయితే ఓటుకు నోటు వ్యవహరంలో చంద్రబాబు నాయుడును ఎవరు ఏం చెయ్యలేరని చెప్పిన లోకేష్ తాజాగా ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ భయపడుతోందని విమర్శించారు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కాలి గోటికి కూడా సరిపోరని, చంద్రబాబు నాయుడుది ఢిల్లీ లెవల్ గల్లీ లెవల్ కాదు అని లోకేష్ అప్పుడప్పుడు కామెంట్లు చేస్తూ వార్లల్లో నిలుస్తున్నారు. అయితే గత కొంత కాలంగా అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో ఎంతో కీలకంగా మారిన నారా లోకేష్ తాజాగా మరో సారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసానిస్తూ వ్యాఖ్యానించారు.

Also Read: అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునేది కేసీఆర్: నారా లోకేష్

ఈసారి జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్టీ కార్యకర్తల భజన చేసిన నారా లోకేష్ తాజాగా ఇక మీదట తెలంగాణ, ఏపిలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. నెలలో పదిహేను రోజులు తెలంగాణ కార్యకర్తలకు, మరో పదిహేను రోజులు ఏపి కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. అయితే ఏపిలో ఉన్న కార్యకర్తలు హైదరాబాద్ రావాలంటే ఇబ్బంది పడుతున్నారని అందుకే ఇక మీద విజయవాడలో అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసారు. అలాగే కార్యకర్తల సమస్యలకు పరిష్కారం చూపుతామని కూడా హామీ ఇచ్చారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు చెప్పిన రెండు కళ్ల సిద్దాంతాన్ని బాగా వంట పట్టించుకున్న నారా లోకేష్ నెలలో పదిహేను రోజులు తెలంగాణకు, మరో పదిహేను రోజు ఏపికి కేటాయించడం విశేషమే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naralokesh  TDP  Telangana  AP  Telugudesamparty  Chandrababu naidu  

Other Articles