Jana Reddy met trs mp vinod kumar | political gossips | telangana state | congress leaders

Jana reddy met trs mp vinod kumar political gossips telangana state

jana reddy, trs mp vinod kumar, janareddy escape news, jana reddy gossips, congress party news, telangana states, telugu states updates, congress party gossips, jana reddy updates, jana reddy with vinod kumar

Jana Reddy met trs mp vinod kumar political gossips telangana state : The meeting of congress senior leader jana reddy and trs mp creates sensation in politics. After this meeting the rumours going viral that jana will join trs party soon

జంప్ జిలానీల్లో జానా.. ఆ కీలక భేటీయే కారణం!

Posted: 07/02/2015 10:00 AM IST
Jana reddy met trs mp vinod kumar political gossips telangana state

సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఘోరంగా పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం వలసల పరంపర తీవ్ర ఆందోళనల్లో ముంచేసింది. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో ఒక్కొక్కరు క్రమంగా అధికార పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కాంగ్రెస్ నేతలు అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోగా.. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయంతో పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా రాజీనామా చేయనున్నారనే పుకార్లు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కొన్ని బలమైన కారణాలూ వున్నాయి.

బుధవారం (01-07-2015) టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ నేరుగా జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో కలిశారు. 10 నిముషాలపాటు ఏకాంతంగా చర్యలు కూడా జరిపారు. ఈ భేటీ అనంతరం బయటికొచ్చిన వినోద్ కుమార్.. తాను కేవలం పుస్తకావిష్కరణ కార్యక్రమం కోసం ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి వచ్చినట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం వినోద్ మాటలను ఏమాత్రం నమ్మడం లేదు. పార్టీ మారే విషయమై వారిద్దరి మధ్య చర్చలు కొనసాగి వుంటాయని వారు భావిస్తున్నారు. ఎందుకంటే.. గతకొన్నాళ్ల నుంచి జానారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండడమే కాక ఆ పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా వినోద్ తో భేటీ అవడాన్ని చూస్తుంటే జానారెడ్డి పార్టీ వీడడం ఖాయమేనని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం.

ఒకవేళ జానారెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో జంప్ అయిపోతే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో పుట్టగతులు లేకుండా పోయిన తమ పార్టీని కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా పుంజుకునేలా ప్రయత్నాలు చేద్దామని భావించారు. కానీ.. ఇంతలోనే సీనియర్ నేతలు జంప్ కావడాన్ని చూస్తుంటే.. తెలంగాణలోనూ ఆ పార్టీ త్వరలోనే ఖాళీ అవడం ఖాయమని చెప్పకనే చెప్పవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jana reddy  vinod kumar  trs party  congress leaders  

Other Articles