Revanth Reddy, Supreme court, speech, words, cash for vote

Revanth oral vestonda rude pave the way to jail

Revanth Reddy, Supreme court, speech, words, cash for vote

REVANTH oral vestonda rude .. pave the way to jail? Telangana TDP Leader Revanth Reddy may cost jail for his speech after release from the cherlapalli jail.

రేవంత్ నోటి దురుసే జైలుకు బాటలు వేస్తోందా..?

Posted: 07/02/2015 10:33 AM IST
Revanth oral vestonda rude pave the way to jail

ఓటుకు నోటుకు వ్యవహారంలో ఏ1 ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. చర్లపల్లి జైల్ నుండి విడుదలైన తర్వాత అభిమానుల కోలాకలం మధ్య రేవంత్ రెడ్డి బయటకు వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చర్లపల్లి .జైల్ నుండి ఎన్టీఆర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే జైల్ నుండి విడుదలైన రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, తెలంగాణ మంత్రుల మీద విమర్శలు కురిపించారు. తెలంగాణ మంత్రులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ వారందరూ లెసలెస మాట్లాడుతున్నారని, సోడాలు కలిపేవాళ్లు, మోండా మార్కెట్‌లో ఆలుగడ్డలు అమ్మే వ్యక్తి మంత్రులయ్యారని.. సన్నాసులంతా తాగుబోతోడి పక్షం చేరారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

అయితే రేవంత్ మాటలే ఇప్పుడు మరోసారి జైలు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైకోర్ట్ రేవంత్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ మీద సుప్రీంకోర్టుకు వెళ్లనుందని ఇప్పటికే సమాచారం. అయితే తాజాగా రేవంత్ రెడ్డి జైల్ నుండి విడుదలైన తర్వాత మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని, పరుష పదజాలంతో రేవంత్ రెడ్డి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ అడ్వకేట్స్ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. అయితే నిన్నటి రేవంత్ మాటలు, మీసం మెయ్యడం, మంత్రులను తిట్టడం లాంటి వాటిని సీడీ రూపంలో కోర్ట్ కు సబ్ మిట్ చెయ్యనున్నారు. అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ బెయిల్ మీద ఇప్పటికే వాదనలకు అంతా సిద్దం చేసిన తరుణంలో తాజాగా రేవంత్ మాటలు కూడా వాదనకు పనికి వస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టులో తెలంగాణ అడ్వకేట్స్ వేస్తున్న కేసును ఎగదోసింది తెలంగాణ ప్రభుత్వం అని సమాచారం. ఏదిఏమైనా కానీ రేవంత్ రెడ్డి మాటలే మరోసారి జైలు బాట పట్టిస్తాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Supreme court  speech  words  cash for vote  

Other Articles