Women injured in rail accident at Churchgate terminal in Mumbai

Mumbai local train crashes into platform at churchgate station

Mumbai Local Train Crashes into Platform at Churchgate Station, National News,Western Railway , Local train rams into dead end at Churchgate; 5 hurt, Mumbai,Churchgate Station,Mumbai Local Train,Mumbai Local Train Crash, news, India news

A local train today crashed into the dead end at the Churchgate station here, injuring five passengers and disrupting the suburban train services on the Western Railway line.

ITEMVIDEOS: ప్లాట్‌ఫారంపైకి దూసుకెళ్లిన రైలు.. మహిళకు తీవ్ర గాయాలు

Posted: 06/28/2015 11:00 PM IST
Mumbai local train crashes into platform at churchgate station

ముంబయి, జూన్ 28: ముంబయిలోని చర్చిగేట్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఒక లోకల్ రైలు ప్లాట్‌ఫామ్ చిట్టచివరకు దూసుకెళ్లడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదం కారణంగా పశ్చిమ లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భయాందర్ నుంచి వేగంగా వస్తున్న ఈ రైలు ఉదయం దాదాపు 11.25 గంటల సమయంలో చర్చిగేట్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంది. అయితే డ్రైవర్ ఆ రైలును ఆపలేకపోవడంతో మూడో నెంబర్ ప్లాట్‌ఫారం చిట్టచివరి వరకూ దూసుకెళ్లింది. దీంతో ఆ రైలు మొదటి బోగీ పక్కకు ఒరిగిపోయింది.

రైలు బ్రేకులు ఫైయిలు కావడంతోనే ఈ రైలు అదుపు తప్పి ష్లాట్ ఫారంపైకి దూసుకోచ్చిందని, దీంతో రైలును స్టేషన్‌లో ఆపలేకపోయామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్నది దర్యప్తు తర్వాతే తెలుస్తుందని, దీని గురించి ఇప్పుడే మాట్లాడటం అపరిపక్వతే అవుతుందని పశ్చిమ రైల్వే చీఫ్ పిఆర్‌ఓ శరత్ చంద్రయాన్ అన్నారు. పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ఎస్‌కె.సూద్, డివిజనల్ రైల్వే మేనేజర్ శైలేంద్ర కుమార్ సీనియర్ అధికారులతో ప్రమాద స్థలానికి చేరుకుని రైళ్ల రాకపోకల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Local Train  Crashes into Platform  Churchgate Station  Women injured  

Other Articles