Governor, Narasimhan, VH, VHanmanthaRao, Cashforvote, Letter, Rajnath singh

Congress senior leader vh wrote that narsimhan like swamy better than governor

Governor, Narasimhan, VH, VHanmanthaRao, Cashforvote, Letter, Rajnath singh

congress senior leader VH wrote that narsimhan like swamy better than governor. VH wrote a letter on telugu states situation. He wrote governor behaviour in the cash for note case.

నరసింహన్ గవర్నర్ గా కన్నా స్వామీగా సూపర్.?

Posted: 06/29/2015 07:35 AM IST
Congress senior leader vh wrote that narsimhan like swamy better than governor

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఎంత భక్తిపరుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నరసింహన్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దాదాపు అరవై సార్లకు పైగా తిరుమల తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు సమాచారం. అయితే గవర్నర్ తరుచూ తిరుమల వెళ్లడం వల్ల భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గతంలో రకరకాల వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు కామెంట్ వార్తల్లో నిలిచింది.
ఓటుకు నోటు ఉదంతంతో తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో గవర్నర్‌ నరసింహన్‌ చొరవ చూపడం లేదని అన్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా గుళ్ల చుట్టు తిరుగుతున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆరోపించారు.గవర్నర్‌ ఎన్నెన్ని గుళ్లు ఎన్నెన్ని సార్లు తిరిగారో పరిశీలించండి. నరసింహన్‌ గవర్నర్‌గా కంటే స్వామీజీగానే సరిపోతారని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు.

ఇద్దరు సీఎంల చెప్పేది వినడం తప్ప గవర్నర్ సమస్యకు పరిష్కారం చూపడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావ్ తన లేఖలో వివరించారు. . ఇప్పటి వరకు సెక్షన్‌ 8పై డిమాండ్‌ చేసిన ఆంధ్ర నాయకులు ఇప్పుడు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కోరుతున్నారని, మరో వైపు తెలంగాణ సీఎం తానే రాష్ట్రాన్ని తెచ్చినట్లు, దానిపై సర్వాధికారాలు తనవే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని లేఖలో కోరారు. కాగా ఓటుకునోటు కేసులో వెలుగులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ చాలా అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. ఈ వ్యవహారంలో ఏపీలోని విశాఖ నుంచి పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు నోటీసులిచ్చినా.. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేసులు పెట్టినా.. గవర్నర్ పట్టించుకోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. గవర్నర్ అప్రమత్తంగా ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావన్నారు. తాను ఇప్పటికే ఓటుకునోటుపై హోంమంత్రికి స్వయంగా వివరిస్తే.. గవర్నర్ చూసుకుంటారని చెప్పారన్నారు. కానీ గవర్నర్ ఆ రీతిలో స్పందించడం లేదన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  Narasimhan  VH  VHanmanthaRao  Cashforvote  Letter  Rajnath singh  

Other Articles