Abuse By Security Forces Most Significant Human Rights Problem In India, Says US Report

Us report highlights widespread corruption in india

US report highlights 'widespread corruption' in India, indian security forces violate human rights, abuse by security forces, human rights, india, us report, India, National Democratic Alliance

Even as it praised India for holding "the largest democratic elections in history", the US on Thursday highlighted "police and security force abuses" and "widespread corruption" among its "most significant human rights problems"

అత్యాచారాలు, హింస, హక్కుల ఉల్లంఘన.. భారత్ పరువు తీసిన అమెరికా నివేదిక..

Posted: 06/26/2015 09:13 PM IST
Us report highlights widespread corruption in india

అగ్రరాజ్యం అమెరికా మరోమారు తన దమననీతిని ప్రదర్శించింది. తమ దేశంలో ఏకంగా వైట్ హౌస్ వద్ద అధ్యక్షుడు బరాక్ ఒబామాను హతమార్చేందుకు రెక్కీలు జరుగుతన్న విషయాలను పక్కన బెట్టి.. అసలు ప్రపంచంలో ఎక్కడా లేదని విధంగా భారత్ దేశంలో హింస ప్రజరిల్లుతుందని కుటిల బుద్దితో నివేదికను రూపోందించింది. తమ దేశంలో పెరుగుతున్న గన్ కల్చర్ ను, నల్లజాతీయుల హింసలను, దారి దోపిడీలను, దోపిడీలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అభివృద్ది చెందుతున్న దేశాలపై ఇలా తన అక్కస్సును వ్యక్తం చేసింది. తమ దేశంలో ఓ మహిళ ఒంటరిగా తిరిగితే అమెను ఎంతమంది కామెంట్లు చేశారో.. మరెంరెందరు ఏమేం చేశారో..? తెలుసుకుని కూడా పరాయి దేశాలలో మాత్రమే హింప పెరుగుతోంది.  అదేశ అభివృద్దిన అడ్డుకుంటుందని అభాండాలు వేసి భారత దేశ అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అమెరికా విడుదల చేసిన నివేదికలో ఏ ఏ అంశాలు వున్నాయో చూడండీ..

భారత్ లో భద్రతా దళాలు, పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ, అరాచకాలు చేస్తున్నారని, దేశానికి ఇదే పెను సమస్యగా మారిందని అమెరికా ప్రభుత్వం తాజాగా ఒక నివేదికను తయారు వెలువరించింది. మానవ హక్కులను కాపాడటంలో సైన్యం, పోలీసు వ్యవస్థ విఫలమయ్యాయని పేర్కోంది. అత్యాచారాలు, లంచాలు తీసుకోవడం, ప్రజలను హింసించడం, ఎన్ కౌంటర్లు, నేరాలపై సరైన సమయంలో స్పందించకపోవడం వంటి పలు ఆరోపణలు వారిపై వున్నాయని యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ వివరించింది.

ఎతో మంది మాయమవుతున్నారని, జైళ్లలో పరిస్థితి దారుణంగ ావుందని అన్యాయంగా అరెస్టై నిర్భందంలో వున్నవారి సంఖ్య పెరుగుతోందని, విచారణ నిమిత్తం దీర్ఘకాలం పాటు జైళ్లో మగ్గాల్సిన పరిస్థతి ఏర్పడిందని అరోపించింది.అత్యాచారాలు, గృహహింస వరట్న హత్యలు, పరువు హత్యలు, లైంగిక వేదింపులు, మహిళల పట్ల అగౌరవం అదితరాలు ఇ:డియాలో తీవ్రమైన సాంఘీక సమస్యలని పేర్కోంది. యువతుల అక్రమ ట్రాఫికింగ్, చిన్నారులతో వెట్టిచాకిరరి, యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగడం దేశాన్ని వెనక్కు నెడుడుతన్నాయని అభిప్రాయపడింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్రజాస్వామ్య దేశంగా వున్న ఇండియాలో గత సంవత్సరం పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వెల్లడించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US report  corruption  human rights  india  elections  

Other Articles