ఒకప్పుడు ఆ జంట బుల్లితెర(టీవీ)పై ఓ వెలుగు వెలిగిన ప్రేమజంట. అంతేకాదు, ఆ ప్రేమజంట నిజ జీవితంలో ప్రేమించుకున్నరు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు కూడా. ‘నాచ్ బచాలియే' సీజన్-4 విజేతలుగా కూడా వీరు నిలిచారు. బుల్లితెర భార్యాభర్తలుగా అలరించిన ఈ జంట పయనం.. ఇప్పుడు విడాకుల దిశగా సాగుతోంది. ఆ జంటే టీవీ నటుడు షలీన్ బానోత్, దల్జీత్ కౌర్. వివరాల్లోకి వెళితే.. తనను శరీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తన భర్త షలీన్ బానోత్‌పై దల్జీత్ కౌర్ ఫిర్యాదు చేసింది.
షలీన్ పెట్టే హింస తట్టుకోలేక తన కొడుకు షారవ్‌తో కలిసి బెంగళూరులోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని ఓ ఆంగ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. తమ స్థాయికి తగ్గ సంబంధం రాలేదనే కోపంతో తనను అత్తగారు వివాహమైన మరుసటి రోజు నుంచే వేధించేవారని చెప్పింది. తన తండ్రికి ముగ్గురు కూతుర్లని, ఆయన పెద్ద మొత్తంలో కానుకలు ఇచ్చే పరిస్థితిలో లేరని తెలిపింది. ఓసారి తన తండ్రి ముందే తోసేశాడని, దీంతో తన కాలికి తీవ్ర గాయమైందని చెప్పింది. అయినా అతడ్ని క్షమించి అతనితో ఉండేందుకే ప్రయత్నించానని తెలిపింది.
తాను గర్భవతి అయిన తర్వాత తనకు అస్తమా వచ్చిందని, అయితే తనను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా షలీన్ వచ్చేవాడు కాదని కౌర్ తెలిపింది. తనకు కొడుకు పుట్టిన తర్వాత కూడా తనతోపాటు ఆస్పత్రికి వచ్చేవాడు కాదని చెప్పింది. అంతేగాక, తనతో ఉండేవాడు కాదని, రాత్రుల్లో కూడా తన వద్దకు వచ్చేవాడు కాదని తెలిపింది. మరోసారి తన చేతులను విరిచేందుకు ప్రయత్నించాడని చెప్పింది. దీంతో అతని చిత్రహింసలు భరించలేక తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. అయితే తాను రిటైరైన తన తల్లిదండ్రులకు భారంగా ఉండాల్సి వస్తోందని వాపోయింది.
షలీన్ మారతాడని భావించినప్పటికీ.. అతడు తన కొడుకు షారవ్‌కు ఆహారం తీసుకొచ్చేందుకు కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదని తెలిపింది. ఒక సారి తన స్నేహితురాలు తనకు ఫోన్ చేసి.. షలీన్, ఎవరో ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటుండగా చూసినట్లు చెప్పిందని తెలిపింది. దీంతో తాను షలీన్‌ను ప్రశ్నిస్తే.. అతడు తనను గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించాడని తెలిపింది. ఆ తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని, మళ్లీ తిరిగి రాలేదని చెప్పింది. దీంతో తాను షలీన్‌పై కేసు పెట్టానని తెలిపింది. కాగా, కౌర్ పెట్టిన కేసుల్లో షలీన్ ఇప్పటికే మూడు సార్లు బెయిల్ పొందాడు. తనకు న్యాయం జరగాలని, షలీన్‌కు శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు దల్జీత్ వివరించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more