Section 8 | Kodandaram| Hyderabad | ap | telangana

Telangana jac chairman kodandaram condemn the governor rule in the hyderabad

Section 8, Kodandaram, Hyderabad, ap, telangana

Telangana JAC chairman Kodandaram condemn the governor rule in the Hyderabad. Kodandaram oppose the implementation of section 8 in hyderabad.

గవర్నర్ గిరిని ఒప్పుకోమంటున్న కోదండరామ్

Posted: 06/26/2015 09:13 AM IST
Telangana jac chairman kodandaram condemn the governor rule in the hyderabad

తెలుగు రాష్ట్రాల్లో సెక్షన్ 8 మీద వివాదం రాజుకుంది. ఉమ్మడి రాజధానిగా ఉన్న  హైదరాబాద్ లో విభజన చట్టంలో చెప్పినట్లుగా సెక్షన్ 8 ను అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి కూడా తీసుకువస్తోంది. అయితే హైదరాబాద్ లో సెక్షన్ 8 పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో గవర్నర్ పెత్తనానికి ఒప్పుకునేది లేదని టీజేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. సెక్షన్ 8 ప్రజలు కోరుకున్నది కాదని, రెండు రాష్ట్రాల మధ్య సమాచారం కోసం, ప్రజల్లో నమ్మకం కలిగించడానికి మాత్రమే ఉద్దేశించిందని కొదండరామ్ అన్నారు. ప్రస్తుతం ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉన్న హైదరాబాద్ లో సెక్షన్ 8 అవసరం లేదని, గవర్నర్, కేంద్ర పెత్తనం ఎందుకు అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ప్రజల స్వేచ్చకు భంగం కలిగినపుడు, ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగినపుడు గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి అప్పటికీ సంతృప్తి కలగకపోతే మాత్రమే గవర్నర్ తన అభిప్రాయాన్ని చెప్పవచ్చునని అన్నారు.

ఓటుకు నోటు కేసు తెర మీదకు రావడం వల్లే తాజాగా సెక్షన్ 8 గురించి వివాదం రాజుకుందని కోదండరామ్ అన్నారు. హైదరాబాద్ పై పెత్తనం చెలాయిద్దామని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఓటుకు నోటు కేసును తప్పు దారి పట్టించేందుకే తెర మీదకు సెక్షన్ 8 ను తీసుకువస్తున్నారని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఓటుకు నోటు కేసులో న్యాయస్థానంలో తేల్చుకోవాలే తప్ప ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించడ మంచిది కాదు అని పరోక్షంగా చంద్రబాబు నాయుడుకు హితవు పలికారు. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్దమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన జేఏసీ తెలంగాణ స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు మరో ఉద్యమానికి కూడా వెనుకాడబోమని కోదండరామ్ హెచ్చరించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Section 8  Kodandaram  Hyderabad  ap  telangana  

Other Articles