LK Advani Not Invited to Sangh-Backed Bodys Event to Mark Emergency | Bjp Party | Narendra Modi

Lk advani not invited to sangh backed bodys event to mark emergency bjp party

lk advani, lk advani news, lk advani controversy, lk advani bjp angry, lk advani angry news, lk advani latest updates, emergency function, rss foundation, rss function, emergency in india, 40 years emergency, naredra modi

LK Advani Not Invited to Sangh-Backed Bodys Event to Mark Emergency Bjp Party : Another invitation has not reached BJP patriarch LK Advani, this time one from an RSS-backed foundation that organised a function today to mark 40 years of Emergency.

‘ఎమర్జెన్సీ’ అన్నారు.. అద్వానీని అవమానం చేశారు!

Posted: 06/26/2015 09:48 AM IST
Lk advani not invited to sangh backed bodys event to mark emergency bjp party

భారతీయ జనతాపార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి అయిన కురవృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి.. ఇప్పుడు అదే పార్టీలో కనీసం గౌరవం కూడా లభించడం లేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనపై అవమానాల పరంపర కొనసాగుతూనే వస్తోంది. నరేంద్రమోడీ ప్రధాని అయిన అనంతరం పార్టీలో సీనియర్ నేతలందరికీ ఏ పదవి ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టేశారు. ఆ లిస్టులో అద్వానీ పేరే మొదటగా వినిపించింది. ఇక మోడీ ప్రాభవం మరింతగా పెరగడంతో.. చాలా సందర్భాల్లో అద్వానీ అంతగా ప్రాధాన్యత లభించక అవమానమే మిగిలింది. దీంతో ఆయన ఆయా సందర్భాల్లో అలిగారు కూడా! ఇప్పుడు మళ్లీ ఆయన్ను సొంత పార్టీ అవమానపరిచిందన్న వార్తలు గుప్పుమన్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. దేశంలో ఎమర్జెన్సీ అమలై 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీజేపీ అనుబంధ సంస్థ ‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశోధనా సంస్థ’ గురువారం ఢిల్లీలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ నేతలు చాలామంది హాజరుకాగా.. అద్వానీ మాత్రం కనిపించలేదు. ఎందుకంటే.. ఆ కార్యక్రమానికి ఆయనకు అసలు ఆహ్వానమే అందలేదని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఇటీవల ‘ఎమర్జెన్సీ’పై అద్వానీ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయనకు ఆ కార్యక్రమం నుంచి ఆహ్వానం అందలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అద్వానీ సదరు కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదన్న అంశంపై బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమాధానమిచ్చేందుకు నిరాకరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lk advani  emergency 40 years  narendra modi  rss  

Other Articles