Forensic lab | Audio tapes | Revanth Reddy | Telangana | ACB

Forensic science lab clear that the tapes are original

Forensic lab, Audio tapes, Revanth Reddy, Telangana, ACB, Stephenson, Chandrababu

Forensic science lab clear that the tapes are original. In the case of cash for vote, Telangana acb shoot the Revanth Reddy giving cash to Stephenson.

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు ఎదురుదెబ్బ

Posted: 06/25/2015 07:52 AM IST
Forensic science lab clear that the tapes are original

ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫన్ సన్ తో మాట్లాడినట్లు ప్రసారమైన టేపులపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పరీక్షలు నిర్వహించి ప్రాధమిక నివేదిక అందించింది. అయితే ఏసీబీ కోర్టుకు ఈ మేరకు తన నివేదనకను ఏసీబీ కోర్టు ముందుంచింది. అయితే ఆడియో టేపులు అన్నీ నిజమే అని, ఎలాంటి అతుకులు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్దారించింది. అయితే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా వేసిన సమయంలో ఇలా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావడం ఎదురుదెబ్బే. టేపుల్లో ఎఖ్కడా కూడా కట్ అండ్ పేస్ట్ చెయ్యలేదని, టేపుల్లో ఉన్నవి నిజమైనవే అని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వివరించింది.

నిజానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుండి నిదేవిక రావడానికి కొంత సమయం కావాలని ఫోరెన్సిక్ బృందం కోరింది. కానీ కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో కనీసం  ప్రాథమిక నివేదికనైనా ఇవ్వాలన్న ఏసీబీ సూచన మేరకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు కోర్టుకు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. ఈ సమాచారం కాపీని తమకు ఇవ్వాలంటూ కోర్టును ఏసీబీ లిఖిత పూర్వకంగా కోరింది. కోర్టు నుంచి నివేదిక అందిన తర్వాత ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలి, మరెవరికైనా నోటీసులు జారీ చేయా లా, విచారణకు రావాలని కోరాలా అన్నది పరిశీలించనున్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాలకు ఊపేస్తున్న ఓటుకు నోటు కేసు దాదాపు క్లైమాక్స్ కు ముందు దశకు చేరింది. ఇక ఆడియో టేపులను పరిశీలించడానికి షాంపిల్స్ సేకరించి అవి నిజంగా నిందితులు లేదా అనుమానితులు మాట్లాడినవేనా కాదా అన్న విషయాన్ని నిర్దారిస్తారు.

టేపులు నిజమే అని తేలడంతో తెలంగాణ ప్రభుత్వం ఇక మీదట దూకుడు పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఏసీబీ అధికారులు ఇక మీదట ఎవరెవరికి నోటీసులు .జారీ చెయ్యాలనే ఆలోచనలో ఉంది. నేరుగా చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇవ్వాలా లేదా అని తెలంగాణ ఏసీబీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఇక మరో పక్క చంద్రబాబు నాయుడుకు కాకుండా మిగిలిన వారు ఎవరెవరు ఈ కేసుతో సంబందం ఉందో వారిని పిలిపించి దర్యాప్తు చెయ్యాలని తెలంగాణ అధికారులు సిద్దమవుతున్నారు. ఆడియో టేపులు నిజమే అని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఇవ్వడం తెలుగుదేశం పార్టీ నేతలను కలవర పెడుతోంది. పార్టీ అధినేత వాయిస్ కూడా నిజమే అని తేలితే ఏం చెయ్యాలా అని తర్జనభర్జన పడుతున్నారు. మరో పక్క తెలంగాణ సర్కార్ పై వత్తిడి పెంచేందుకు ఏపి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ లో శాంతిభద్రతలు గవర్నర్ కు అప్పగించేలా సెక్షన్ 8 ను అమలు చెయ్యాలని చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు చేస్తోంది. కాగా శుక్రవారం రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాదనలో తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తు బెయిల్ ఇవ్వొద్దు అని వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Forensic lab  Audio tapes  Revanth Reddy  Telangana  ACB  Stephenson  Chandrababu  

Other Articles