section 8 | ashok babu | hyderabad | telangana | apngo | tngo

Ap ngos demand for implementing section 8 in hyderabad

section 8, ashok babu, hyderabad, telangana, apngo, tngo

AP ngos demand for implementing section 8 in Hyderabad. But telangana ngos are opposing the section 8. Telangana cm kcr moving forward on section 8 file.

ఉద్యోగులలో సెక్షన్ 8 సెగలు

Posted: 06/25/2015 08:22 AM IST
Ap ngos demand for implementing section 8 in hyderabad

సెక్షన్‌ 8 అమలు చేయకపోతే అసలు విభజనే లేదని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌బాబు వివరించారు. విభజన తరువాత పదేళ్ల వరకు హైదరాబాద్‌లో వుండే హక్కు తమకు ఉందన్నారు. విభజన చట్టంలో ఉన్నదానినే అమలు చేయాలని కోరుతున్నామని, దీనిపై గవర్నర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.  హైదరాబాద్‌పై పెత్తనం చెలాయించే ఆలోచన తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్‌ - 8 వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ సెక్షన్‌ను అమలు చేస్తే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టగా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారని, సెక్షన్‌ 8 అమలు చేయకపోతే రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచుతూ నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని పెద్దలు డిమాండ్‌ చేస్తున్నా రు.

మరోపక్క సెక్షన్‌ 8ని అమలును నిరసిస్తు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి.ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి సెక్షన్‌ 8పై తాడో పేడో తెల్చుకోవాలని ఈ సంఘాలు నిర్ణయించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సెక్షన్‌ 8పై ఇప్పటి దాకా ఎటువంటి నోటిఫికేషన్‌ వెలువరించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వేచిచూసే ధోరణిని అవలంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రంలో బస చేసి సెక్షన్‌ 8కి సంబంధించి ఢిల్లీలోని ముఖ్య నేతలతో పాటు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న సీనియర్‌ మంత్రులతో టెలిఫోన్‌ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖలో 8 సెక్షన్‌కు సంబంధించి ఎటువంటి కదలిక లేదని ఒకటి రెండు రోజుల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వానికి సమాచారం అందినట్టు ప్రచారం జరుగుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : section 8  ashok babu  hyderabad  telangana  apngo  tngo  

Other Articles