Tnews | sakshi | Chandrababu | ap | police | notices

Today is the last day to sakshi and tnews to respond on the audio tapes of chandrababu naidu

Tnews, sakshi, Chandrababu, ap, police, notices

Today is the last day to sakshi and Tnews to respond on the audio tapes of chandrababu naidu. Ap police issue the notices to Tnew and sakshi three days back.

టిన్యూస్, సాక్షిలు నోటీసులపై స్పందించాయా..?

Posted: 06/22/2015 08:34 AM IST
Today is the last day to sakshi and tnews to respond on the audio tapes of chandrababu naidu

ఓటుకు నోటు వ్యవహారంలో కీలక మలుపు తిరిగిన ఘటన చంద్రబాబు నాయుడు స్టీఫన్ సన్ తో మాట్లాడినట్లు వచ్చిన ఆడియో టేపులు. అయితే  చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా వచ్చిన ఆడియో టేపులను ప్రసారం చేసింది టి న్యూస్, సాక్షి ఛానల్. టి న్యూస్ అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందినది కాగా సాక్షి జగన్ మోహన్ రెడ్డికి చెందినది. అయితే రెండు ఛానల్స్ మొదట ఆడియో టేపులను ప్రసారం చేశాయి. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడారని, అన్నీ చూసుకుంటానని కూడా అన్నారని ఆడియో ద్వారా తెలుస్తోంది. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో దూకుడు పెంచిన ఏపి ప్రభుత్వం తాజాగా ఈ రెండు ఛానల్స్ కు నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు కేబుల్ చట్టం కింద జారీ చేశారు ఏఫి పోలీసులు.

మీ చానల్స్ లో వచ్చిన ఆడియోలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయి.. మరి ఆడియో టేపుల మీద మీ వివరణ ఏంటీ అని నోటీసులు అందించారు. ఆడియో టపులు ఎక్కడి నుండి లభించాయి..? ఎవరు ఇచ్చారు..? అన్న దానిపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీస్ లో వెల్లడించారు. అయితే టీ న్యూస్, సాక్షి ఛానల్స్ కు మూడు రోజుల గడువు కూడా ఇచ్చారు. అయితే ఆ రోజుతో రెండు ఛానల్స్ కు ఇచ్చిన గడువు తీరిపోతుంది. మరి ఇక ముందు ఏపి సర్కార్ రెండు ఛానల్స్ పై ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది అన్నది తెలియాలి. అసలే దూకుడు మీదున్న ఏపి మీడియా ఛానల్స్ వ్యవహారంలోనూ అంతే దూకుడుగా వ్యవహారిస్తాయా లేదా వెనక్కి తగ్గుతాయా చూడాలి. మరోపక్క నోటీసులపై అటు టీ న్యూస్, ఇటు సాక్షిలు ఏం వివరణ ఇస్తాయో అన్ని అందరూ ఎదురు చూస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tnews  sakshi  Chandrababu  ap  police  notices  

Other Articles