Chocolate May Lower Risk of Heart Disease, Study Says

A chocolate a day keeps heart disease away

chocolate a day keeps heart disease away, Chocolate May Lower Risk of Heart DiseaseChocolate, Heart, United Kingdom, Phyo Myint, University of Aberdeen, Heart, LDL Cholesterol, Memory Decline, Chocolate, Research, Heart disease

A new study conducted by researchers in the United Kingdom suggests that eating 3.5 ounces of chocolates a day can help lessen the likelihood of developing heart-related ailments such as stroke, heart attack and heart disease.

రోజుకు రెండు చాక్కెట్లు.. హృదయాన్ని పధిలపర్చు..

Posted: 06/20/2015 08:49 PM IST
A chocolate a day keeps heart disease away

ప్రతిరోజూ చాక్లెట్లు తినడం మంచిదా, కాదా? అన్న అనుమానం ప్రతీ ఒక్కరిలో కలుగుతోంది. ముఖ్యంగా పిల్లలను మాత్రం వారి తల్లిదండ్రులు చాక్కెట్లకు దూరంగా వుంచుతుంటారు. దీనికి కారణం.. ప్రతిరోజూ చాక్లెట్లు తింటే వంటికి మంచిది కాదని, దంతాలు పాడు కావడం మాత్రమే గాక ఇతర ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తాయని వారు భావించడమే. అయితే ఇలాంటి భావనలకు ఇక చెక్ చెప్పండి. ఎందుకంటారా..?  రోజుకో చాక్లెట్‌ తినండి, హృద్రోగాలకు దూరంగా ఉండండి అని తాజాగా పరిశోధకులు చెబుతున్నారు.

ఈ విషయాన్నే హార్ట్‌ అనే మెడికల్‌ సైన్స్‌ జర్నల్‌లో పరిశోధకులు వెల్లడించారు. వారు దాదాపు 20వేల మందిని ఎంపిక చేసి వారితో పరిశోధనా పద్ధతి ప్రకారం చాక్లెట్లు తినిపించి ఫలితాన్ని విశ్లేషించారు. చాక్లెట్లు తిన్నవారికంటె చాక్లెట్లు తిననివారిలోనే హృద్రోగ సంబంధమైన వ్యాధికి అవకాశాలు ఎక్కువ అని తేలింది. చాక్లెట్‌లో కోకో పదార్థంతో పాటు పాలు, చక్కెర ఉంటాయి. చక్కెర గురించి, పాల గురించీ అందరికీ తెలిసిందే.

ఈ రెండూ తీసేస్తే మిగిలింది కోకో. ఇందులో ఉండే పాలిఫినోల్స్‌ మనిషికి గుండె పోటు రాకుండా కాపాడుతున్నట్టు భావించాలని పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఈ పాలిఫినోల్స్‌ మనిషి రక్త నాళాలు మరింత ఆరోగ్యంగా ఉండేటట్టు పనిచేస్తున్నాయని భావించాలని పరిశోధకులు తేల్చారు. వంద గ్రాముల బరువు ఉన్న చాక్లెట్లు తింటే పెద్ద సమస్యేమీ ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే అమితంగా తీసుకుంటే ఔషదం కూడా విషంగానే మారుతుందన్న పెద్దలు చెప్పిన మాటను మాత్రం మరువరాదు సుమండీ..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chocolate  Research  Heart disease  

Other Articles