central govt | chandrababu | modi | Bjp | TDP | Tapping

Central govt moves very stratigically on the issue of cash for vote

central govt, chandrababu, modi, Bjp, TDP, Tapping, cash for vote

Central govt moves very stratigically on the issue of cash for vote. central govt not cooperating the ap govt or chandrababu naidu. Chandrababu naidu expect more responce from central govt.

ఓటుకు నోటు కేసులో కేంద్రం గేమ్ ప్లాన్..!

Posted: 06/18/2015 08:31 AM IST
Central govt moves very stratigically on the issue of cash for vote

ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు వెడేక్కుతుంటే.. ఈ విషయంలో ఆచితూచి స్పందించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఢిల్లీలోని పెద్దలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఈ సమయంలో తలదూర్చితే అవినీతి మకిలి అంటుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. పైగా ఇప్పటికే లలిత్‌మోడీ వ్యవహారంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కారు... ఓటుకు నోటు వ్యవహారంలో కలుగజేసుకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అదే సమయంలో ఇదే అదునుగా భావించి ఎపిలో రాజకీయంగా బలపడాలని చూస్తోంది. ఓటుకు నోటు వ్యవహరంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మంతనాలు జరిపినప్పటికీ ఆశించిన రీతిలో స్పందనలేదన్నది టిడిపి నేతలవాదన

ఢిల్లీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో ఎపి పునర్వవ్యస్థీకరణ చట్టంలోని సెక్షన్‌-8ని అమలు పరచాలన్న డిమాండ్‌ను ప్రముఖంగా ముందుకు తెచ్చినప్పటికీ.. ఫోన్‌ ట్యాపింగ్‌, ఓటుకు నోటు వ్యవహరంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ అంశంలో చంద్రబాబుకు ప్రధాని నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల వరకు ఎలాంటి హామీనివ్వలేకపోయారు. ఎందుకంటే.. ఎన్డీయే ఏడాది పాలనలో అవినీతి మరక లేకుండా సంవత్సరం పూర్తి చేశామని ప్రకటనలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఈ సమయంలో చంద్రబాబును వెనకేసుకొస్తే.. అవినీతి మచ్చపడ్డ నేతను కాపాడరనే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ విషయంలో ఎలాంటి హామీనివ్వలేకపోయారు. పైగా దీన్ని ఆసరగా చేసుకుని రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే దక్షిణాదిలో బలపడాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇతర రాజకీయ పార్టీల ముఖ్య నేతలను చేర్చుకోవడం అందులో భాగమే.. ప్రస్తుతం టిడిపి అవినీతి మరకతో ప్రజల్లో అప్రతిష్ట మూటకట్టుకుంటే రాజకీయంగా ఎదగాలని భావిస్తోందని తెలుస్తోంది. అందుకే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌ ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా రెండు రాష్ట్రాల పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో నివేదికలు తెప్పించుకుని రాష్ట్ర పరిస్థితులను క్షణ్ణంగా పరిశీలిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశించిన రీతిలో ఎదురుదాడి చేయడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో టిడిపి ఇరుకున పడితే ఇటు తెలంగాణలోనూ బిజెపిని బలోపేతం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : central govt  chandrababu  modi  Bjp  TDP  Tapping  cash for vote  

Other Articles