Chandrababu naidu, New House, GHMC, Permissiion, Hyderabad, ap, cabinet

Ap chandrababu naidu discuss about his new house in the cabinet meeting

Chandrababu naidu, New House, GHMC, Permissiion, Hyderabad, ap, cabinet

ap, chandrababu naidu discuss about his new house in the cabinet meeting. Telangana govt, GHMC didnt give premission to the new house chandrababu said.

బాబు ఇంటి అనుమతిపై తెలంగాణ సర్కార్ పేచీ..?

Posted: 06/18/2015 08:22 AM IST
Ap chandrababu naidu discuss about his new house in the cabinet meeting

తెలంగాణ సర్కార్ చేస్తున్న తప్పులపై చంద్రబాబు నాయుడు దృష్టిసారించారు. పాపం ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ తాజాగా తన హైదరాబాద్ ఇంటికి అనుమతులు రావడం లేదని.. ఇదే విషయాన్ని ఏపి ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు చర్చించారు. ఉమ్మడి రాజధానిలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఇంటికే అనుమతులు రావడం లేదని ఇక మామూలు వ్యక్తుల పరిస్థితి, సీమాంధ్రుల విషయంపై తెలంగాణ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో తెలుస్తోందని చంద్రబాబు క్యాబినెట్ మంత్రులతో చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు తన కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ నెలన్నర క్రితం జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన నెల లోపు అనుమతి ఇవ్వాలి. కానీ నెలన్నర అయినా ఆ అనుమతిని ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినియోగిస్తున్న భవనాలకు ఆస్తి పన్ను కడితేనే తన ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తామని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ అనుమతికి, సచివాలయ భవనాల ఆస్తి పన్నుకి సంబంధం ఏమిటని అడిగితే... అది ప్రభుత్వ నిర్ణయమని, తామేం చేయలేమని సంబంధిత అధికారులు చెప్పినట్లు సమాచారం.

అయితే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో సెక్షన్ 8 ను అమలు చెయ్యాలని ఏపి కేబినెట్ లో చర్చించారు. హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రుల రక్షణకు సంబందించిన అంశం కాబట్టి గట్టిగా పోరాటం చెయ్యాలని.. కీలక అంశాలపై గవర్నర్ కు హక్కులు కల్పించేలా చూడాలని చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి అనుమతులపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యులు గవర్నర్‌ సలహాదారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో... ‘సెక్షన్‌ 8 అమల్లోకి రాకపోవడం వల్ల హైదరాబాద్‌లో ఏపీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్వయంగా నేను కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను. నా ఇంటి నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు’ అని చంద్రబాబు కేబినెట్‌ సమావేశంలో చెప్పినట్లు సమాచారం. అనుమతిని ఎలా ఆపుతారని మంత్రులు ప్రశ్నించారు. అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు దాని గురించి వివరించారు. సచివాలయంలో ఏపీ సర్కార్‌ వినియోగిస్తున్న భవనాలకు ఆస్తి పన్ను కట్టాలని కోరుతున్నారని, అది కట్టలేదంటూ సీఎం ఇంటి నిర్మాణ అనుమతిని పెండింగ్‌లో ఉంచారని ఆయన చెప్పారు. ఆ పన్ను కట్టవచ్చు కదా చంద్రబాబు ఆయనను ప్రశ్నించారు. ‘భవనాలపై ఓనర్‌ షిప్‌ ఉంటేనే ఆస్తి పన్ను చెల్లించాలి. మనకు యాజమాన్య హక్కు లేదు. అది ఇస్తే మనం ఆస్తి పన్ను చెల్లించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. దాని గురించి అడిగితే సమాధానం చెప్పరు. కాని పన్ను మాత్రం చెల్లించాలంటారు. అదే సమస్య’ అని ఐవైఆర్‌ వివరించారు. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం సాగుతున్న వివాదంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇంటి వ్యవహారం కూడా తెర మీదకు వచ్చింది. మరి చంద్రబాబు గారి కొత్త ఇంటికి తెలంగాణ సర్కార్ ఎప్పుడు అనుమతి ఇస్తుందో..? తాజాగా ఇలా క్యాబినెట్ లో చర్చించారని తెలిస్తే టి సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  New House  GHMC  Permissiion  Hyderabad  ap  cabinet  

Other Articles