KCR | ACB | Telangana | Revanth Reddy | cash for vote, Chandrababu

In cash for vote case may telangana cm kcr and telangana acb will book

KCR, ACB, Telangana, Revanth Reddy, cash for vote, Chandrababu

In cash for vote case May Telangana cm kcr and telangana ACB will book. In past, Chattisgarh cm also accuesed as same as this case.

రేవంత్ కాదు బుక్కయ్యేది కేసీఆరే.. ఎందుకంటే

Posted: 06/13/2015 03:01 PM IST
In cash for vote case may telangana cm kcr and telangana acb will book

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఓటుకు వ్యవహారంలో రోజుకో విషయం బయటకు వస్తోంది. అయితే స్టింగ్ ఆపరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తెలంగాణ ఏసీబీ అధికారులకు ముందు కష్టకాలం ఉంది అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అందుకు వారు తగిన ఆధారాలు కూడా చూపుతున్నారు. అయితే గతంలో జరిగిన ఉదంతాన్ని చూపుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా, తెలంగాణ ఏసీబీ అధికారులు కూడా ఈ విషయంలో బుక్కవుతారు అంటోంది. తెలుగుదేశం పార్టీ అంటున్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని పోలిన మరో ఉదంతాన్ని ఉదహరిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.

2003లో అప్పుటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి దిలీప్ సింగ్ జుదెఒ ను రాజకీయంగా దెబ్బతీయటానికి అప్పటి చత్తీస్ ఘడ్ ముఖ్య మంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి మరో ముగ్గురు తో కలిసి చేసిన స్టింగ్ ఆపరేషన్ పెద్ద సంచలనం అయ్యింది. ఈ కేసు సిబిఐ కి అప్పజెప్పారు.సిబిఐ కేసు పెట్టి విచారణ చేపట్టింది అందులో ముఖ్యమంత్రి దిలీప్ సింగ్ ను A1గా, A2 నట్వర్ రాతేరియా మినిస్టర్ PS, A3 భూపిందర్ సింగ్ పటేల్ టీవీ ఛానల్ రిపోర్టర్, A4 అరవింద్ విజయ్ మోహన్ , కార్డింగ్ చేసే ఎక్విప్మెంట్ సరఫరా చేసిన వ్యక్తి, A5 అమిత్ జోగి కట్ర ధారుడు, A6 రజత ప్రసాద్ టీవీ ఛానల్ ఓనర్ ఉన్నారు.

దీనిపై సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం no criminal appeal 747/2010 మరియు  748/2010 ఉన్న సాక్షా అధరాలు పర్గిగనలొకి తీసుకొని ఈ విధముగా తీర్ఫు ఇచింది
1) స్టింగ్ ఆపరేషన్ అనేది అనైతికం, ఒక వ్యక్తికి ఉద్దేశం లేఖ పోయిన తన ని ప్రేరేపించి ఒక నేరం చేయటానికి ఉచ్చు లో కి లాగటం. కావున ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసిన అవి న్యాయ స్తానం లో చెల్లవు.
2) స్టింగ్ ఆపరేషన్ అనేది నేరం కాబట్టి స్టింగ్ ఆపరేషన్ కి సహకరించిన వారు శిక్ష అర్హులు కావున ఈ కేసు లో టీవీ రిపోర్టర్, వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ సప్లై చేసిన వ్యక్తి కి, ఆ టీవీ ఛానల్ అధిపతి శిక్ష అర్హులు అని తీర్పు ఇచ్చింది

రేవంత్ రెడ్డి కేసు కి పైన కేసు కి చాల దగ్గర పోలికలు ఉన్నాయి.

1) అక్కడ స్టింగ్ ఆపరేషన్ ప్రైవేటు వ్యక్తులు చేస్తే ఇక్కడ ACB చేసింది ఇది కూడా నేరమే కావున ACB అధికారులు ఇక్కడ శిక్ష అర్హులు
2) పోలీస్ లు ఒక నేరం జరగకుండా చూడాలి కాని ఇక్కడ ప్రేక్షక పాత్రా వహించి అది రికార్డు చేయటం తప్పు. హత్య జరుగుతుంది అని తెలిసినాక హత్య జరగ కుండ చూడాలి కాని హత్యను ప్రేరేపించ కూడదు. ఈ కేసు లో పోలీస్ అధికారులు కూడా ఇరక్కుంటారు
3) ఈ కేసు లో stephenson శిక్ష అర్హుడు
4) వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ సప్లై చేసిన వ్యక్తి,ప్రసారం చేసిన చానల్స్ కూడా శిక్ష అర్హులు
5) ఫోన్ రికార్డింగ్ లేదా tapping అనేవి కోర్ట్ లో చెల్లని సాక్షాలు. అవి tap చేయటము నేరం. తెలంగాణా హోం మంత్రి గారు నోరు జారి మా దగ్గర చాల టేప్ లు ఉన్నాయి అన్నారు కావున తెలంగాణా పోలీస్ ఉన్నత అధికారులకు లేదా తెలంగాణా ప్రభుత్వ పెద్దలకు కచ్చితంగా చుట్టుకుంటది .

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  ACB  Telangana  Revanth Reddy  cash for vote  Chandrababu  

Other Articles