water war | Irrigation | KCR | Telangana | AP | Palamur irrigation

Telugu states once again ready to war for water

water war, Irrigation, KCR, Telangana, AP, Palamur irrigation

Telugu states once again ready to war for water. The telangana cm KCR and Ap irrigation minister Uma fired on irrigation projects.

ఇది నీళ్ల పోరాటం.. పార్టీల ఆరాటం

Posted: 06/12/2015 04:40 PM IST
Telugu states once again ready to war for water

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మరోసారి నిప్పు రాజేసింది. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులు కడుతోందంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. అయితే, ఏ అనుమతులతో ఏపీ ప్రాజెక్టులు కడుతోందంటూ రివర్స్ ఎటాక్ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. అయితే, నీటి అంశంలో మొదలైన ఈ మాటలు తీవ్ర దూషణల దాకా వెళ్లడంతో పరిస్థితి మరోసారి శృతి మించినట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి యుద్ధం ముదురుతోంది. అయితే ఈసారి టాపిక్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కేంద్రంగా మొదలైంది. మహబూబ్-నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రయోజనాల కోసం ప్రాజెక్ట్ కడుతున్నామంటున్న కేసీఆర్ మాటలపై ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా కేంద్ర జల సంఘం, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్-మెంట్ అనుమతి తప్పనిసరి అన్నారు. అవి లేకుండానే ప్రారంభోత్సవం చేసిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కేసీఆర్ చట్టానికి తూట్లు పొడుస్తున్నట్లు ఆరోపించారు.

అయితే.. దీనికి కేసీఆర్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సంక్రమించిన 100 టీఎంసీల కృష్ణా నీటిలో 90 టీఎంసీలను పాలమూరుకు వాడుతున్నామన్నారు. సమైక్యంగా ఉన్నప్పుడు ఏ అనుమతులు తీసుకుని ఆంధ్రా ప్రాజెక్టులు కట్టారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రస్తావించిన పట్టిసీమ అంశంపై అంతకు ముందే దేవినేని వివరాలు అందించారు. పోలవరం మొదలయ్యాక పట్టిసీమను ఆపేస్తామన్నారు. కేసీఆర్ చెబుతున్న పాలమూరు లిఫ్ట్ ద్వారా ఏపీలో కృష్ణా, ప్రకాశం జిల్లాలే కాదు తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలు కూడా నష్టపోతాయన్నారు. ఇక రాయలసీమ వ్యతిరేకిస్తున్న రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్ట్ ఎత్తును ఎట్టిపరిస్థితుల్లో పూర్తిచేస్తామన్నారు టీఎస్ సీఎం. కర్నాటకతో మాట్లాడి ఏపీ అంతు చూసేలా ఆ ఆర్డీఎస్ నిర్మాణం జరుపుతామన్నారు.శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి వాడకం విషయంలో గతంలో గవర్నర్ చొరవతో కుదిరిన రాజీ ఇప్పుడు పాలమూరు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల అంశంతో మళ్లీ రాజుకుంటోంది. ఏపీ తెలంగాణల మధ్య తీరని నీటి యుద్ధానికి తెరతీయబోతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : water war  Irrigation  KCR  Telangana  AP  Palamur irrigation  

Other Articles