funds for sanitation workers will be released today najeeb jung

Rahul gandhi joins striking sanitation workers in east delhi

Rahul Gandhi joins striking sanitation workers in East Delhi, AAP Government, Delhi Government, Arvind Kejriwal, Rahul Gandhi, Delhi Civic Agencies, MCD, NDMC, Municipal Corporation of Delhi, Sanitation workers, Safai karamcharis

Congress Vice President Rahul Gandhi sat on the ground surrounded by protesting sanitation workers in East Delhi, parts of which have turned into giant garbage dumps with an estimated 15,000 tonnes of waste rotting on roadsides in the sweltering summer heat.

రాహుల్ నడిరోడ్డుపై కూర్చున్నాడు.. జీతబెత్యాలు వచ్చాయి

Posted: 06/12/2015 09:22 PM IST
Rahul gandhi joins striking sanitation workers in east delhi

ఢిల్లీలో పూర్తిస్థాయి ప్రజామోదంతో అధికారంలోకి వచ్చిన అఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆద్యంతం బాలారిష్టాలను ఎదుర్కోంటూ సమస్యల సుడిగుండంలోకి జారిపోతోంది. పోలీస్ అధికారుల నియామకంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో ఇప్పటికే పీకల్లోతు వివాదాలతో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న అప్ ఫ్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆఫ్ ప్రభుత్వానికి చెందిన న్యాయశాఖ మంత్రి తోమర్ ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్ల కేసులో అరెస్టు అయ్యారు. అదే సమయంలో అప్ మరో సినీయర్ నేత తన భార్య వరకట్న వేదింపుల కేసులో జాతీయ మహిళా కమీషన్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి రావడంతో.. అప్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. అదే సమయంలో తాజాగా ఆప్ ప్రభుత్వానికి మరో సమస్య వచ్చిపడింది.

తాజాగా కాంగ్రెస్ యువనేత, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెగ కూడా కేజ్రీవాల్ సర్కార్ కు తగిలింది. గత కొద్ది రోజులుగా మున్సిఫల్ ఉద్యోగులు చేస్తున్న దీక్షకు రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఏకంగా నడిరోడ్డుపై బైఠాయించి కేజ్రీవాల్ సర్కారుకు నిరసన తెలిపారు. సకాలంలో వేతనాలు చెల్లిందాలని డిమాండ్ చేస్తూ.. ఆయన ధీక్షలో కూర్చున్నారు. దీక్షలో భాగంగా వారితో భేటీ అయిన రాహుల్ గాంధీ.. వారి సమస్యలను కులంకుషంగా తెలుసుకున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలిసిన ఆయన మున్సిపల్ కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కొరారు.

రాహుల్ గాంధీ దీక్షపై విమర్శలు గుప్పించినప్పటికీ.. మరోవైపు ఆయనకు ఇటీవల కాలంలో వస్తున్న పాపులారిటీతో కొంత వెనుకంజ వేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. తక్షణం నిధుల విడుదలపై నిర్ణయం తీసుకున్నాయి. గత రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించకుండా ఉన్న జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలన్న వారి డిమాండ్ పై స్పందించిన ప్రభుత్వం.. రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇవాళే వారికి మొత్తం రూ.493 కోట్లు విడుదల చేయాల్సిందిగా నగర మేయర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే వారికి జీత భత్యాలు చెల్లించాలని అదేశించారు. ఇంకేం.. రాహుల్ నడిరోడ్డుపై కూర్చోని దీక్షకు మద్దతు పలకడంతో ఆయన ఖాతాలో జీతబెత్యాల క్రెడిట్ వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Najeeb Jung  Rahul Gandhi  Sanitation  Strike  Garbage Crisis  

Other Articles