RevanthReddy | Engagement | Nimesha Reddy | Geetha | Charlaplly

Revanth reddy daughter naimesha reddy cried at her father

RevanthReddy, Engagement, Nimesha Reddy, Geetha, Charlaplly

Revanth Reddy daughter Naimesha Reddy cried at her father. Revanth and his family members arrived to enconvension and engagement is going on.

ITEMVIDEOS: కన్నీరు పెట్టిన రేవంత్ కూతురు

Posted: 06/11/2015 10:23 AM IST
Revanth reddy daughter naimesha reddy cried at her father

బెయిల్ మీద విడుదలైన తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా సాగుతోంది. రేవంత్ రెడ్డి ఈ ఉదయం జైలు నుండి విడుదల కాగానే నేరుగా జూబ్లిహిల్స్ లోని తన ఇంటికి వెళ్లారు. జైలు నుండి విడుదలైన తమ నేత రావడంతో అభిమానులు రేవంత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. పూల వర్షం కురిపించారు. తర్వాత ఇంటి్కి చేరుకున్న రేవంత్ కు దిష్టితీసి ఇంట్లోకి పంపించారు. వచ్చీరాగానే తన తండ్రిని చూసిన రేవంత్ కూతురు నైమిషారెడ్డి కన్నీటి పర్యంతమైంది. తన తండ్రిని హత్తుకొని ఏడ్చేసింది. అయితే రేవంత్ రెడ్డి కూతురుని సముదాయిస్తూ.. ఏం కాలేదమ్మా అంటే ఊరడించే ప్రయత్నం చేశారు. తర్వాత నిశ్చితార్థానికి రెడీ అయిన రేవంత్ రెడ్డి, తన కూతురు, బార్య గీతతో కలిసి ఎన్ మ్యాన్షన్ కు బయలుదేరారు. అయితే ఈ ఉదయం జరిగే నిశ్చితార్థ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు కుటుంబ సభ్యులతోనే ఉండి.. తర్వాత చర్లపల్లి జైలుకు బయలుదేరతారు. ఈ నిశ్చితార్థానికి చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ కీలకనేతలు, పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RevanthReddy  Engagement  Nimesha Reddy  Geetha  Charlaplly  

Other Articles