Police | Royal enfield | Telangana | KCR | Hyderabad

The telangana government presenting brand new royal enfield bullets to hyderabad police

police, Royal enfield, telangana, KCR, Hyderabad

The Telangana government presenting brand new Royal Enfield Bullets to hyderabad police. The makeover is a part of the city police's plans to improve its standards and this public safety.

హైదరాబాద్ పోలీసులకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్

Posted: 06/11/2015 10:55 AM IST
The telangana government presenting brand new royal enfield bullets to hyderabad police

తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసులకు కొత్త కొత్త ఫెసిలిటీలు కల్పిస్తోంది. అందులో భాగంగానే గత బడ్జెట్ లో 400 కోట్ల రూపాయలను కేటాయించింది తెలంగాణ సర్కార్. గతంలో కన్నా దాదాపు రెండు రెట్ల నిధులతో విడుదల చెయ్యడంతో పాటు పోలీసు శాఖకు అన్ని సదుపాయాలను వేగంగా కల్పిస్తోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే లేటెస్ట్ మోడల్ ఇన్నోవాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక హైదరాబాద్ పోలీసులకు బైకులు, కొత్త కొత్త వెహికిల్స్ కల్పిస్తోంది తెలంగాణ సర్కార్. అయితే తాజాగా మరో అడుగు ముందుకేసీ పోలీసులకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ను ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముందుగా న్యూయార్క్ తరహాలో కొత్త మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ను అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే తెలంగాణ పోలీసు శాఖలో భారీ మార్పులు చేసిన తెలంగాణ సర్కార్ తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికిల్స్ ఇవ్వడంపై దృష్టిసారించింది. అందులో భాగంగా ఇప్పటికే గుజరాత్ పోలీసులకు బహుకరించిన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాల గురించి ఆరా తీసిందట. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చడంలో భాగంగానే తెలంగాణ సర్కార్ హైదరాబాద్ పోలీసులకు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పటికే హ్యాపీగా ఉన్న తెలంగాణ పోలీసులు తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు వస్తుండటంతో మరింత ఆనందంగా ఉన్నారట. కేసీఆర్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారట తెలంగాణ పోలీసులు. అయినా తెలంగాణ సర్కార్ వచ్చినప్పటి నుండి తెలంగాణ పోలీసులకు భలే రాజయోగం పట్టింది అని వేరే శాఖల వాళ్లు అనుకుంటున్నారట.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police  Royal enfield  telangana  KCR  Hyderabad  

Other Articles