Two killed after drunk lawyer driving on wrong side rams taxi | mumbai crime news

Two killed after drunk lawyer driving on wrong side rams taxi

drunk lawyer driving, mumbai drunk and drive case, Salim Saboonwala, Janhavi Gadkar drunk and drive, Janhavi Gadkar crime news, Reliance Industries Limited

Two killed after drunk lawyer driving on wrong side rams taxi : Inebriated lawyer in Audi on wrong side of expressway hits taxi with family returning home after celebrating son’s exam results: Police.

డ్రంక్ అండ్ డ్రైవ్.. ఇద్దరిని బలితీసుకున్న మహిళా న్యాయవాది

Posted: 06/10/2015 10:56 AM IST
Two killed after drunk lawyer driving on wrong side rams taxi

‘మందుకొట్టి కారు నడపకండి.. లేకపోతే అనర్థాలు చోటు చేసుకుంటాయి’ అంటూ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు. ప్రజలు తమ వైఖరిలో ఏమాత్రం మార్పు తెచ్చుకోవడం కాదు కదా.. ఇంకా బరితెగిస్తున్నారు. పైగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్మూలనలో భాగంగా పోలీసుల దర్యాప్తు కేంద్రాలు మరింతగా పెంచినప్పటికీ.. ఫలితం లేకుండాపోతోంది. అందుకు ఉదాహరణగా ఇటీవలే ఓ లేడీ డాక్టర్ మద్యం తాగి పోలీసులకు చుక్కలు చూపించిన ఉదంతాన్నే తీసుకోవచ్చు. అయితే.. తాజాగా మరో మహిళ మందుతాగి కారు నడపడమే కాకుండా.. ఆ మత్తులో ఇద్దరి మృతికి కారణమైంది. ఇంకో విశేషమేమిటంటే.. ఆమె ఓ న్యాయవాది కూడా! అలాంటి వృత్తిలో కొనసాగుతూ ఈ దారుణానికి పాల్పడడం తీవ్రకలకలం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ మహిళా న్యాయవాది పేరు జాహ్నవీ గడ్కర్. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో న్యాయవిభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. సంఘంలోనే ఉన్నత స్థితిలో వున్న ఆమె.. మద్య సేవించి కారు నడపడమే కాకుండా ఆ మత్తులో ఇద్దరు మరణానికి కారణమైంది. తన ఆడీ క్యూ-3 కారును రాంగ్ రూటులో నడిపిస్తూ.. ఓ టాక్సీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాక్సీలో వున్న సాబూవాలా(50), హుస్సేన్ సయీద్ (57) లు ఇద్దరూ మరణించారు. దీంతో పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. తాను మద్యం తాగినట్లుగా ఆ న్యాయవాది అంగీకరించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతానికి ముందే ఆమె రెండు బైకులను ఢీకొట్టబోయి తృటిలో తప్పించిందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janhavi Gadkar  drunk and drive case  Reliance Industries Limited  

Other Articles