KCR | Chandrababu | Telangana | Fall

Chandrababu naidu said that if kcr tries to arrest me his government will fall

KCR, Chandrababu, telangana, Govt, Arrest

Chandrababu naidu said that If KCR Tries to Arrest Me, His Government Will Fall The political slugfest between Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and Telangana Chief Minister K Chandrasekhar Rao over the cash-for-votes scam intensified on Tuesday with Mr Naidu saying it will be end of KCR's regime if he tries to arrest him.

ITEMVIDEOS: బాబును అరెస్టు చేస్తే తెలంగాణ సర్కార్ ఫట్..?

Posted: 06/10/2015 10:44 AM IST
Chandrababu naidu said that if kcr tries to arrest me his government will fall

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తే తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య దుమారానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ మీడియాతో మాట్లాడారు. తనను అరెస్టు చెయ్యాల్సి వస్తే మాత్రం తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు చంద్రబాబు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఛానల్ తన గురించి ఏదేదో ప్రచారం చేస్తున్నాయని వాటి మీద తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణ, ఏపిలు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు అన్నారు.


ఇక తెలంగాణలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీల తెలుగుదేశం పార్టీ నేతలనే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. తమ పార్టీ నుండి టిఆర్ఎస్ లో చేరిన వారికి మంత్రి పదవులు కూడా ఇస్తున్నారు కేసీఆర్ అంటూ చంద్రబాబు కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. అయితే ఈ ఎపిసోడ్ గమనిస్తున్న వారు మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్టు కన్ఫార్మ్ అయ్యింది కాబట్టే చంద్రబాబు ఇలా అరెస్ట్ అయితే అదీ.. ఇదీ అంటూ మాట్లాడుతున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు రాష్ట్రపతిని, పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు నాయుడు కలవనున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Chandrababu  telangana  Govt  Arrest  

Other Articles