Fake certificate row: Delhi Law Minister Jitendra Singh Tomar arrested

Delhi law minister jitendra singh tomar arrested

Jitendra Singh Tomar, Delhi, Aam Aadmi Party, Sanjay Singh, Tilak Manjhi Bhagalpur university, Fake certificate row, Delhi Law Minister, Delhi Police, Narendra Modi government, Aam Aadmi Party,N ajeeb Jung, Arvind Kejriwal, Delhi law minister arrested, law ministrer arrested

Delhi Law Minister and Aam Aadmi Party (AAP) leader Jitendra Singh Tomar was on Tuesday arrested in connection with the fake degree row.

నకిలీ డిగ్రీ ‘అమాత్యుడి’ తోsముడిపించిన పోలీసులు

Posted: 06/09/2015 12:01 PM IST
Delhi law minister jitendra singh tomar arrested

ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంపూర్ణ మోజారిటీతో అధికారంలోకి వచ్చిన అమ్ ఆద్మీ పార్టీకి అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ ప్రజలకు అవినీతి రహిత పాలనందిస్తామని అధికారంలోకి వచ్చిన అఫ్ పార్టీకి చెందిన మంత్రిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. ఇది వాస్తవానికి ఆయన వ్యక్తిగత విషయమే అయినా.. అప్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కోనసాగుతుండటంలో పార్టీకి కూడా ఈ మకిలీ అంటక తప్పేట్టు లేదు. అప్ ప్రభుత్వంపై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించి, నిరసన కార్యక్రమాలతో విరుచుకుపడే విపక్షాలు ఈ అంశాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేట్టు కనిపించడం లేదు.

నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదిగా చలామణి అవుతున్న ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ను పోలీసులు అరెస్టు చేశారు. తోమర్ పత్రాలపై గతంలో అనుమానం వ్యక్తం చేసిన ఢిల్లీ బార్ కౌన్సిల్.. దీనిపై దక్షిణ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదుచేసింది.ఉత్తర ప్రదేశ్‌లోని రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ నుంచి పొందిన డిగ్రీ పట్టా నకిలీదిగా యూనివర్సిటీ తేల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిహార్‌లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి రిజిష్టర్ నంబర్ 3687తో పొందినట్లు ఎల్‌ఎల్‌బీ పట్టా నకిలీదని సంబంధిత యూనివర్సిటీ కూడా తేల్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తోమర్ 2011లో బార్‌కౌన్సిల్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసి అదే సంవత్సరం సభ్యత్వం పొందారు. ఆయన పట్టాల వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయనను ఇవాళ ఉదయం అరెస్టు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jitendra singh tomar  delhi law minister  fake law degree  tomar arrested  

Other Articles