Chandrababu | Tapping | Tammineni | Telangana | ap

Telangana minister agree the tapping allegations

Chandrababu, Tapping, Tammineni, Telangana, ap

Telagana minister Agree the tapping alligations. Telangana Minister Tammineni said that the telangana govt tapped the broker phone, but not chandrababu naidu phone./

ట్యాపింగ్ పై నిజం ఒప్పుకున్న తెలంగాణ మంత్రి

Posted: 06/09/2015 11:26 AM IST
Telangana minister agree the tapping allegations

తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి అరెస్టు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ దుమారం కుదిపేస్తోంది. అయితే చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంత్రి ఏపి మంత్రులు, తెలుగుదేశం పార్టీ కీలకనేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ, ఏపి అధికారులు మండిపడుతున్నారు. ఇదే అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే తన ఫోన్లను ట్యాప్ చెయ్యడంపై స్వయంగా చంద్రబాబు స్పందించారు. నా ఫోన్లను ట్యాప్ చెయ్యడానికి మీరెవరు.. నేను వ్యక్తిని కాదు ఓ రాష్ట్రానికి సిఎంని అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి చంద్రబాబుతో సహా కీలకనేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అన్న వార్తలపై ఓ తెలంగాణ మంత్రి వివరణ ఇచ్చారు. ట్యాపింగ్ చేస్తున్న మాట వాస్తవమే అంటూ నిజం ఒప్పుకున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి..? ఏం నిజం ఒప్పుకున్నారు..? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే స్టోరీ చదవాల్సిందే.

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే తాము ఎవరి ఫోన్టలను ట్యాప్ చెయ్యలేదని తెలంగాణ మంత్రలు కొంత మంది వివరణ కూడా ఇచ్చుకున్నారు. కానీ ఏపి అధికారులు సేకరించిన సాక్షాల ఆధారంగా ట్యాపింగ్ జరిగింది అని ఏపి అదికారులు, తెలుగుదేశం నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే తాజాగా ట్యాపింగ్ చేస్తున్న మాట వాస్తమే అంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ట్యాపింగ్ వ్యవహారంపై గుట్టురట్టు చేశారు తుమ్మల నాగేశ్వర్ రావ్. అయితే ట్యాపింగ్ చేస్తున్న మాట వాస్తవమే కానీ చంద్రబాబు నాయుడు ఫోన్ ను ట్యాప్ చెయ్యలేదని బ్రోకర్ ఫోన్ ను ట్యాప్ చేశామని వివరణ ఇచ్చుకున్నారు తమ్మినేని. మొత్తానికి ట్యాపింగ్ పై ఏపి చేస్తున్న వాదనకు తమ్మినేని మాటలు మరింత బలాన్నిస్తున్నాయి. మరి దీనిపై ఏపి ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Chandrababu  Tapping  Tammineni  Telangana  ap  

Other Articles