Complaints filed on kcr, Trs party senior leaders in vizag and vijayawada police stations | revanth reddy controversy

Complaints filed on kcr and kcr party senior leaders revanth reddy controversy

kcr news, revanth reddy controversy, telangana ministers, telangana party, trs party controversy, kcr controversy, kcr complaints, kcr files, revanth reddy news, ap capital city, chandrababu naidu, phone tapping controversy

Complaints filed on kcr and kcr party senior leaders revanth reddy controversy : A government lawyer filed case on telangana ck kcr in vizag police station by complaining that kcr, stephenson both make a plan on chandrababu.

కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ పెద్దలపై కేసులు నమోదు

Posted: 06/08/2015 10:23 AM IST
Complaints filed on kcr and kcr party senior leaders revanth reddy controversy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ పార్టీ పెద్దలపై ఆంధ్రప్రదేశ్ లో కేసులు నమోదు అయ్యాయి. ఏపీ వాణిజ్య రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్ లో కేసీఆర్ పై కేసు నమోదు కాగా.. మరికొందరు టీఆర్ఎస్ పెద్దలపై విజయవాడలోని పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయినట్లు సమాచారం! వీరంతా ఏం చేశారని ఇంత సడెన్ గా కేసులు నమోదయ్యాయి? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే.. మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఇటీవలే టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కి రూ.50 లక్షలు డబ్బులిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే! అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక టీఆర్ఎస్ పార్టీ హస్తముందని ఏపీ మంత్రులు వాదనలు వినిస్తున్న సంగతి విదితమే! ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ న్యాయవాది కేసీఆర్ పై విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్, స్టీఫెన్ సన్ ఇద్దరు కలిసి చంద్రబాబుపై కుట్రపన్నారని ఆ న్యాయవాది ఫిర్యాదు చేసిన మేరకు విశాఖ పోలీసులు కేసీఆర్ పై కేసు నమోదు చేశారు.

ఇదిలావుండగా.. ఏపీ జనవనరుల శాఖమంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే బొండా ఉమాల ఫిర్యాదుతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, అధికారులపై విజయవాడలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరి.. ఈ విధంగా నమోదైన కేసులపై టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  revanth reddy  chandrababu naidu  stephenson  

Other Articles