Telangana, Chandrababu, KCR, laddu, Celebrations, fornation

On telangana formation final celebration govt distribute laddus at tankbund

Telangana, Chandrababu, KCR, laddu, Celebrations, fornation

On Telangana formation final celebration govt distribute laddus at tankbund. Telangana Cm KCR plans to distribute the laddus after dispatch the audio tapes of chandrababu conversation.

కేసీఆర్ లడ్డుల కథ అదేనా..?

Posted: 06/08/2015 09:50 AM IST
On telangana formation final celebration govt distribute laddus at tankbund

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికకు సాయంత్రం చేరుకున్న కేసీఆర్ చివరి దాకా ఉత్సవాలను ఇంట్రస్టింగ్ గా చూశారు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ మీద లక్ష లడ్డూల పంపిణి చేశారు అదికారులు. అయితే మూడు రోజుల ముందే లడ్డూల పంపిణి చెయ్యాలని తెలంగాణ సర్కార్ యోచించింది. వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ముందుండి చూశారు కేసీఆర్. వేలాదిగా చేరుకున్న తెలంగాణవాదులతో ట్యాంక్ బండ్ కళకళలాడింది. అయితే ఇక్కడో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. తెలంగాణ ముగింపు ఉత్సవాల్లో అసలు లడ్డూల పంపిణీ లేదని.. కానీ తరువాత దాన్ని చేర్చారని సమాచారం. అయితే అది కూడా కేసీఆర్ స్వయంగా తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది.

తెలంగాణ ముగింపు ఉత్సవాల్లో బాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ మీద స్వయంగా లడ్డూలను గవర్నర్ దంపతులకు పంపిణీ చేశారు. వేదిక మీద ఉన్న సానియా మీర్జాకు స్వయంగా లడ్డూ తినిపించారు కేసీఆర్. అయితే లడ్డూల వెనుక మరో కోణం ఉంది అని ప్రచారం సాగుతోంది. తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అరెస్టుతో స్వీట్లు పంచుకోవాలని నిర్ణయించారట. అయితే తెలంగాణ ముగింపు ఉత్సవాల్లో బాగంగా కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఆడియో టేపులు మీడియాకు అందే సమయానికి లడ్డూల పంపిణీ చెయ్యాలని కేసీఆర్ ప్లాన్ చేశారట. మొత్తానికి లడ్డూల వెనుక కేసీఆర్ ఇంత ప్లాన్ చేశారంటూ తెగ మాట్లాడుకుంటున్నారట కొంత మంది నేతలు. మరి ఇది నిజమో.. లడ్డూల వెనుక కేసీఆర్ ఇంత ప్లాన్ వేశారో లేదో ఆయనకే తెలియాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Chandrababu  KCR  laddu  Celebrations  fornation  

Other Articles