Uttar Pradesh: Class 9th girl gang-raped by school mates

Class 9th girl gang raped by school mates

9th girl gang raped by school mates, 9th class girl, gang-rape, school mates, Dankaur area, crime on women, violence against women, harrassment against women, rape on minor girl, crime in noida, rape in noida, Noida, Dankaur, Gangrape, school girl, Uttar Pradesh

The girl was allegedly raped by school mates at the room and later on hearing her screams some neighbours came to her rescue, police said.

9వ తరగతి విద్యార్థునిపై సహచర విద్యార్థుల గ్యాంగ్ రేప్

Posted: 06/07/2015 05:55 PM IST
Class 9th girl gang raped by school mates

అత్యాచారారాలపై ఉతర్ ప్రదేశ్ అమాత్యుడు.. వివరణ ఇచ్చిన రోజునే సభ్య సమాజం తలదించుకునే ఘటన గ్రేటర్ నోయిడాలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగింది. అత్యాచారాలు కుర్రాళ్లు, అమ్మాయిల పరస్పర అంగీకారంతోనే జరుగుతాయని.. రేప్‌లు రెండు రకాలు. ఒకటి.. బలవంతంగా చేసేవి. రెండు.. పరస్పర అంగీకారంతో జరిగేవని మంత్రి తోతారామ్ చెప్పుకురావడం.. అలాంటి ఆలోచనలను కూడా లేని యువతతను అత్యాచారాల వైపు ఉరిగోల్పోవిగా వున్నాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు సహాచర విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

గ్రేటర్ నోయిడాలోని డంకౌర్ ప్రాంతంలో శనివారం చేటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. షాపింగ్ కోసం స్థానిక మార్కెట్కి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి... తమ రూమ్కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. బాలిక గట్టిగా అరవడంతో స్థానికులు గది వద్దకు చేరుకుని .... జరిగిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 9th class girl  gang-rape  school mates  Dankaur area  

Other Articles