Ram temple will be built during BJP rule | Ayodhya | Sakshi Maharaj

Ram temple will be built during bjp rule sakshi maharaj

Ram temple will be built during BJP rule, Controversial BJP MP Sakshi Maharaj, Unnao, Sakshi Maharaj, Ram temple, BJP, NDA, Ayodhya, Centre's BJP government, modi government, opposition Congress, criticism, surendra jain, Vishwa Hindu Parishad, Surendra Jain, Sangh Parivar, Ram temple, prime minister narendra modi, Amit Shah, congress, Rahul Gandhi

Controversial BJP MP Sakshi Maharaj today declared that the Ram temple at Ayodhya will be built under the Centre's BJP government, which has "four more years to go", drawing sharp criticism from opposition Congress.

మోడీ కాకపోతే మరెవరి వల్ల సాథ్యం.. రామ మందిర నిర్మాణం..?

Posted: 06/07/2015 05:53 PM IST
Ram temple will be built during bjp rule sakshi maharaj

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయగలిగే సత్తా కేవలం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికే వుందని, ఆయన హయాంలోనే రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని వివాదస్పద ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నాలుగేళ్ల సమయం ఉన్నందున ఎప్పుడైనా మందిర నిర్మాణం జరగొచ్చని చెప్పారు. 'రామమందిరం నిర్మాణం బీజేపీ హయంలో జరగకపోతే మరెవరి హయాంలో జరుగుతుందని ఆయన తిరిగి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రామ మందిర నిర్మాణం సాకారమవుతుందా? ములాయం లేదా మాయావతి కడతారా? అని నిలదీశారు.

అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని విస్మరించిన పక్షంలో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కారుకు కూడా గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం మాదిరిగానే మనజాలదని, గత ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసింది కేవలం అభివృద్ధిని చూసే ఓట్లు వేయలేదని, తమ ప్రధాన ఆకాంక్షలు నేరవేరాలని కూడా భావించారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి, జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సాక్షి మహారాజ్ స్పందించారు.

బీజేపీ పాలనలోనే రామమందిరం నిర్మిస్తామన్నారు. ఇవాళ కాకపోతే రేపు. రేపు కాకపోతే కొన్నాళ్ల తర్వాత నిర్మాణం చేపడతామన్నారు. తమ ప్రభుత్వం కేవలం ఏడాది పాలన మాత్రమే పూర్తయిందని.. ఇంకా నాలుగేళ్లు తాము అధికారంలో కొనసాగుతామని, ఈ సమయంలో ఎప్పుడోప్పుడు రామమందిర నిర్మాణం చేపడతామని సాక్షి మహరాజ్ అన్నారు. మోదీ ప్రభుత్వం అభివృద్ధి అజెండాతోనే అధికారంలోకి రాలేదని కాషాయ అజెండాతో 'పవర్'లోకి వచ్చిందని వెల్లడించారు. అయితే సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఎన్నికలకు ముందు గుజరాత్ అభివృద్దిని చేసి ఓటేయమని కోరిన నరేంద్రమోడీ.. అధికారంలోకి వచ్చాక అజెండాలో లేని అంశాలను తన ఎంపీల ద్వారా తెరమీదకు తీసుకువస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakshi Maharaj  Ram temple  BJP  NDA  Ayodhya  

Other Articles