18 masters blowed down 5862 candles in minute by martial art punches

Blowing a candle with martial arts punches

blowing a candle with martial arts punches, nellore, blowing a candle, martial arts punches, international standard karate, kung fu, karate masters, masters blowed 5862 candles in a minute, nellore IndiraBhavan stadium, shavolin, 18 member karate masters, Guinness World Record, Limca book of records, jury members

nellore Indira gandhi stadium witnessed another martial event blowing down 5862 candles within a minute by 18 masters

మార్షల్ ఆర్ట్స్ లో మరో రికార్డుకు తెర తీసిన సింహపురి..!

Posted: 06/07/2015 05:50 PM IST
Blowing a candle with martial arts punches

రణ విద్యలో రికార్డుకు సింహపురి మరోమారు వేదికైంది. అంతర్జాతీయ స్థాయిలో కరాటే-కుంగ్‌ఫూలో గుర్తింపు పొందిన గ్రాండ్ మాస్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన శిష్యుబృంధం మరో రికార్డును సృష్టించింది. బ్లోయింగ్ ఏ క్యాండిల్స్ విత్ మార్షల్ ఆర్ట్స్ పంచెస్( కొవ్వొత్తులను రణవిద్య ముష్టిఘాతాల వేగంతో వీచే గాలితో ఆర్పడం)లో కరాటే మాస్టర్లు ఒక నిమిషం వ్యవధిలో 5,862 క్యాండిల్స్‌ను పంచెస్‌తో ఆర్పి రికార్డు సృష్టించారు. నెల్లూరు ఇందిరాభవన్‌లో షావొలిన్ కుంగ్‌ఫూ మాంగ్ ట్రైనింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 60 టేబుళ్లపై ఆరువేల కొవ్వొత్తులను వెలిగించారు.

కరాటేలో శిక్షణ పొందిన నెల్లూరుకు చెందిన 18 మంది కరాటే మాస్టర్లు నిమిషం వ్యవధిలో కొవ్వొత్తులపై గాలిలో ముష్టిఘాతాలు విసురుతూ 5,862 కొవ్వొత్తులను ఆర్పారు. ఈ రికార్డును ‘మిరాకిల్ వరల్డ్ రికార్డు’లో నమోదు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న 18 మంది కరాటే మాస్టర్లకు జ్యూరీ సభ్యులు సర్టిఫికెట్‌ను అందజేశారు. అలాగే ఈ రికార్డును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్‌లకు పంపుతామని వివరించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : blowing a candle with martial arts punches  nellore  

Other Articles