Telangana, ap, acb, Revanth Reddy, Telugudesamparty, TRS

Telugudesam party ap leaders said that ap also has the acb dept

Telangana, ap, acb, Revanth Reddy, Telugudesamparty, TRS

Telugudesam party ap leaders said that ap also has the ACB dept. Telugudesam party telangana leader arrested Revanth Reddy by ACB of telangana state.

మా దగ్గరా ఉంది.. ఏ..సీ..బీ

Posted: 06/04/2015 01:01 PM IST
Telugudesam party ap leaders said that ap also has the acb dept

అవినీతి అధికారుల గుండెల్లో రైల్లు పరిగెత్తించే శాఖ.. అవినీతినిరోధకశాఖ. అదే యాంటీ కరప్షన్ బ్యురో. అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత, పైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత ఏసీబీ పేరు మరోసారి మీడియాలో మోగిపోయింది. అయితే పార్టీలకు ప్రయోజనం కలిగించేలా.. ఏసీబీని వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏసీబీ ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే లేదని, ఏపి రాష్ట్రానికి కూడా ఏసీబీ ఉంది అని తెలుగుదేశంపార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ నేతలు నారా చంద్రబాబు నాయుడు ఆడియో టేపులు ఉన్నాయని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తానికి మీ ఒక్క రాష్ట్రంలోనేనా.. మా రాష్ట్రంలోనూ ఏసీబీ ఉంది అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.

తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు, కవితల ఫోన్‌కాల్స్‌ పరిశీలించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌ కొంటోందని ఆయన ఆరోపించారు.తెలంగాణాలో 20వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, పరిశ్రమలు మూతపడి రెండు లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆయన ఆరోపించారు. జగన్‌ గెలిచి ఉంటే రుణమాఫీ జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని అరెస్టు చెయ్యడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఉడికిపోతున్నారు. అందుకే ఏసీబీ బూచి మా దగ్గరా ఉంది అంటున్నారు. మరి దీనిపై తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  ap  acb  Revanth Reddy  Telugudesamparty  TRS  

Other Articles