Fish, ap, godavari, Aakivedu

One kelogram fish only for five rupees at aakivedu of ap

Fish, ap, godavari, Aakivedu

one kelogram fish only for five rupees at aakivedu of ap. In westgodavari dist,. Aakivedu fish rates fallen to five to fifteen rupees.

ITEMVIDEOS: కిలో చేపలు ఐదు రూపాయలే

Posted: 06/04/2015 01:20 PM IST
One kelogram fish only for five rupees at aakivedu of ap

ప్రస్తుతం కూరగాయాల ధరలు ఆకాశనంటుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయలు తీసుకున్నా కిలో 20కి పైనే పలుకుతున్నాయి. ఇక చేపలైతే కిలోకు రెండొందల రూపాయలకు పైమాటే.. మృగశిరకార్తె దగ్గరకు వస్తున్న కొద్దీ వీటి ధర ఇంకా పెరుగుతుంది. కానీ ఆ జిల్లాలో మాత్రం ఈ జలపుష్పాల ధర అమాంతం పడిపోయింది. 5 నుంచి 15 రూపాయలకే కిలో చేపలు దొరుకుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో చేపల ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ఆకివీడులో నైతే మరీ చీప్‌ అయిపోయాయి. వంద రూపాయలు పెడితేకానీ దొరకని చేపలు ఇప్పుడు 5 నుంచి పదిహేను రూపాయలకే వస్తున్నాయి. రేట్లు తగ్గడంతో చేపల మార్కెట్‌ కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. రేట్లు తగ్గడంతో ఆకివీడులో జనం ఆనందంలో ఉంటే.. చేపల రైతులు మాత్రం తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.

కిలో చేప తయారవ్వడానికి 75 రూపాయలు ఖర్చవుతుంది. రవాణా ఖర్చలు, లాభం చూసుకొని వంద రూపాయలకు అమ్మేవారు. అయితే ఇటీవల వాతావరణంలో చేసుకున్న మార్పులు చేపలకు మృత్యుపాశంగా మారాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు.. కొల్లేరు, ఉండి, ఆకివీడు ప్రాంతాల్లోని చెరువుల్లో ఆక్సీజన్‌ శాతం తగ్గి.. భారీ సంఖ్యలో చేపలు చనిపోయాయి. చేసేది లేక ఆక్వా రైతులు వాటిని ఆటోల్లో, వ్యాన్లలో ఆకివీడు మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే ఒక్కసారిగా సరుకు పెరిగిపోయేసరికి.. దళారులు.. చేపల రైతులను నిలువునా దోచేస్తున్నారు. కిలో 5 నుంచి 15 రూపాయలు మాత్రమే చెల్లిస్తాం... అమ్మితే అమ్మండి లేకుంటే లేదని దబాయిస్తున్నారు. పోనీ... తామే అక్కడుండి సరుకు అమ్మకుందామనుకుంటే.. చేపలను నిలువ ఉంచేందుకు కావాల్సిన ఐస్‌ బాక్సులు అక్కడ లేవు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో  ఏదో ధరకు సరుకు అమ్ముకుని వెళ్లిపోతున్నారు. కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తే తమకు ఈ కష్టం ఉండేది కాదని రైతులు వాపోతున్నారు. చేపలు ధరలు అమాంతం పడిపోవడంతో వినియోగదారులతో మార్కెట్‌ కళకళలాడుతోంది. ఐతే.. చేపలు పెంచే రైతులే దిగాలుగా ఉన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fish  ap  godavari  Aakivedu  

Other Articles