Woke, Dead, Tirupati

A man woke after pronounced as he died

Woke, Dead, Tirupati

A man woke after pronounced as he died. In Tirupati a 70years old man dead, but after some he woke up. Everybody at that movement shocked.

ITEMVIDEOS: పాడె మీద నుండి లేచిన శవం

Posted: 06/03/2015 03:48 PM IST
A man woke after pronounced as he died

ఆగిన గుండెమళ్లీ కొట్టుకుంటుంది.. పాడె మీద పడుకున్న వ్యక్తి లేచి కూర్చుంటాడు.. ఇవన్నీ సినిమాల్లో చూసేవే... కానీ తిరుపతిలో ఇదే నిజంగా జరిగింది. దరువు సినిమాలో రవితేజ లేచి కూర్చున్నట్లు ఊపిరి ఆగిపోయిన ఓ వృద్ధుడు తిరిగి బతికాడు. అవును దరువు సినిమాలొ, యమదొంగ సినిమాల్లో హీరోలో చచ్చి మళ్లీ బతికి వస్తే ఎలా ఉంటుందో సినిమాల్లో చూశాం. కానీ నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎలా ఉంటుంది.? కానీ తిరుపతిలో ఇలాంటి ఘటనే జరిగింది. చచ్చాడు అని డాక్టర్లు కూడా కన్ఫార్మ్ చేసిన వ్యక్తి పాడె మీద నుండి లేచికూర్చున్నాడు. అసలు ఏంటా కథ తెలియాలంటే..


తిరుపతి చెంగారెడ్డి కాలనీకి చెందిన శ్రీనివాసులు ఎలక్ర్టికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న ఆయన  చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యులు ధృవీకరించడంతో బాధను దిగమింగుతూ పాడెకట్టి స్మశానానికి పయనమయ్యారు. నాలుగు అడుగులు వేయగానే శ్రీనివాసులు కదలడం ప్రారంభించాడు. దీంతో షాక్ తిన్న బంధువులు వెంటనే కిందకు దింపి గొంతులో నీళ్లు పోశారు. చచ్చిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి బతికి కళ్లు తెరిచి అందరినీ చూశాడు. ఇది కలో నిజమో తెలియక అందరూ అవాక్కయ్యారు. ఇదంతా దేవుని లీల అంటుంటే అసలు చనిపోయి ఉండకపోవచ్చు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా శ్రీనివాసులు కుటుంబం మాత్రం ఆనంద పడుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woke  Dead  Tirupati  

Other Articles