Bostasatyanarayana, Pcc, YSRCP, Congress, AP

Bosta satyanarayana likely to join into ysrcongress party on june7

Bostasatyanarayana, Pcc, YSRCP, Congress, AP

Bosta satyanarayana likely to join into YSRCongress party on june7. The YSRCP leaders completed all discussions with bosta satyanarayana.

ఏడో తేది.. ఏడు గంటలకు బొత్స

Posted: 06/03/2015 04:26 PM IST
Bosta satyanarayana likely to join into ysrcongress party on june7

మామూలుగా ఒకరోకరికి ఒక్కో లక్కీ నెంబర్ ఉంటుంది. చాలా మందికి తొమ్మిది నెంబర్ లక్కీ అనే ఫీలింగ్ ఉంది. అయితే తాజాగా ఓ నేత మాత్రం ఏడో నెంబర్ ను లక్కీ నెంబర్ గా భావిస్తున్నట్లున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరో తెలుసా..? పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ. అవును తాజాగా ఆయన  వైసీపీ తీర్థం పుచ్చుకునే ముహుర్త తేదీ ఖరారైంది. ఈనెల ఏడో తేదీన ఉదయం సరిగ్గా 7.10 గంటలకు హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో సకుటుంబ సపరివార సమేతంగా ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అదే రోజున బొత్సతో పాటు.. ఆయన భార్య, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, సోదరులు, మాజీ ఎమ్మెల్యేలు అప్పల నరసయ్య, అప్పల నాయుడులతో కలిసి బొత్స కుటుంబ సభ్యులంతా వైకాపాలో చేరనున్నారు. వీరితో పాటు మరో 15 మంది ముఖ్యమైన నాయకులు, అనుచరులు కూడా కండువా కప్పుకోనున్నారు.

అలా లాంఛనంగా  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ నెలాఖరులో విజయనగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బొత్స సత్యనారాయణ నిర్ణయించారు. అయితే, బొత్స వెంట వైసీపీలోకి ఎంతమంది వస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు, విజయనగరం జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే షరతుతోనే బొత్సను జగన్‌ తమ పార్టీలోకి తీసుకుంటున్నారని, దీనిని ఉల్లంఘించి అతిగా వ్యవహరిస్తే హైదరాబాద్‌కే పరిమితం కావాల్సి ఉంటుందంటూ వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి జిల్లాలోని గుర్ల మండల పార్టీ సమావేశంలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తానికి వైసీపీలో చేరక ముందే బొత్సకు గడ్డు పరిస్థితి ఎదురయ్యూలా ఉంది మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bostasatyanarayana  Pcc  YSRCP  Congress  AP  

Other Articles