Peetalasujata, ap, TDP, Moneybag

Money bag founded in the ap minister peetala sujata house

Peetalasujata, ap, TDP, Moneybag

Money bag founded in the ap minister peetala sujata house. The Minister complaints on a lady, who met her last. Police arrest the lady and investegating.

ఏపి మంత్రిగారి ఇంట్లో నోట్ల కట్టలు

Posted: 06/03/2015 09:40 AM IST
Money bag founded in the ap minister peetala sujata house

తెలుగుదేశం పార్టీకి బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. అందుకే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. దాంతో టిటిడిపి శ్రేణుల్లో కలవరం మొదలైంది. అయితే తెలంగాణలో టిడిపి నేత రేవంత్ వ్యవహారాన్ని మరిచిపోక ముందే.. ఏపిలో మంత్రి పీతల సుజాత ఇంట్లో నోట్ల కట్టలు మరో తలనొప్పికి కారణమయ్యాయి. తాజాగా పీతల సుజాత ఇంట్లోనే ఓ సంచిలో నోట్ల కట్టలు ఉంచిన ఓ సంచి కనిపించింది. అయితే డబ్బు కట్టలపై మంత్రి పీతల సుజాత సమాధానాలు అనుమానాలకు తావిస్తోంది. ఏపిలో డిఎస్సీ ఫలితాలు వెలువడిన తరువాతి రోజే ఇలా మంత్రి ఇంట్లో కట్టల కట్టల డబ్బులు బయటపడటం వెనుక అనుమానాలు రేగుతున్నాయి. ఉద్యోగాల కోసం పైరవీలు ఏమైనా జరిగాయా..? లేదా రేవంత్ లాగా పీతల సుజాతను కూడా పట్టుకునేందుకే ఇలాంటి ట్రాప్ వేశారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పీతల సుజాత ఇంటికి సొంత ఊరి నుండి ఓ మహిళ వచ్చిందని.. తన కూతురుకు జాబ్ ఇప్పించాలని కోరిందని మంత్రి తెలిపారు. అయితే డబ్బుల సంచి బహుశా ఆ మహిళ మరిచిపోయి ఉంటుందని మంత్రి వెల్లడించారు. కానీ మరోసారి మాత్రం మంత్రి మరోలా సమాధానం ఇచ్చారు. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన ఓ మహిళ డబ్బుల సంచిని తన ఇంట్లో మరిచిపోయి ఉంటుందని వెల్లడించింది. మంత్రి ఇలా పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన ఇంట్లో డబ్బుల సంచి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి తెలిపారు. అయితే మంత్రి ఇంట్లో డబ్బుల సంచితో పాటు డిఎస్సీ హాల్ టికెట్ దొరికింది. అయితే నిన్ననే డిఎస్సీ ఫలితాలు రావడం.. ఆ మరుసటి రోజే మంత్రి ఇంట్లో డబ్బులు దొరకడం వివాదాస్పదమవుతోంది. అయితే మంత్రి ఫిర్యాదుతో సదరు మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మరి నిజం ఏంటో పోలీసులే నిగ్గు తేల్చాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Peetalasujata  ap  TDP  Moneybag  

Other Articles