Chargesheet, TDP, telagana, KCR, Errabelli,Ravula chandrashekar

Charge sheet filed on telangana govt for anti people policy

Chargesheet, TDP, telagana, KCR, Errabelli,Ravula chandrashekar

charge sheet filed on telangana govt for anti people policy. The Telugudesam party leaders Errabelli,Ravula chandrashekar siad that TDP Party filed a charge sheet against the Telangana govt.

తెలంగాణ ప్రభుత్వంపై చార్జ్ షీట్.. ?

Posted: 06/03/2015 08:12 AM IST
Charge sheet filed on telangana govt for anti people policy

పోలీసులు ఏదైనా కేసు నమోదు చేయడం గురించి, ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యడం గురించి మామూలుగా మనం వింటూ ఉంటాం. అయితే తాజాగా ఓ చార్జ్ షీట్ గురించి మాత్రం తెలంగాణలో చర్చ సాగుతోంది. ఏంటీ చార్జ్ షీట్ గురించి అంతలా చర్చించడానికి కారణం ఏంటా అనుకుంటున్నారా..? దాన్ని ఫైల్ చేసింది పోలీసులు కాదు పొలిటికల్ లీడర్లు. అవును పోలీసులే కాదు పొలిటికల్ లీడర్లు కూడా ఛార్జ్ షీట్ నమోదు చేస్తున్నారు మరి. ఇంతకీ విషయం ఏంటీ అంటే తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్ల మెదడులో పుట్టిన బ్రహ్మాండమైన ఆలోచనే ఈ ఎల్లో ఛార్జ్ షీట్. ఏడాది పాటు కేసీఆర్ అస్తవ్యస్త పాలన, అప్రజాస్వామిక విధానాలపై ప్రజల తరఫున చార్జిషీటు విడుదల చేశామని ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల మేనిఫెస్టో నెరవేర్చకపోవడం, నిరంకుశ పరిపాలన, రాజకీయంగా అనైతిక అక్రమాలు వంటి అంశాలతో చార్జిషీటు రూపొందించామన్నారు

అయితే ఓటుకు నోటు స్కాంలో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న రేవంత్‌రెడ్డిని పలువురు టీడీపీ నాయకులు కలిసి పరామర్శించారు. పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, అరవింద్ కుమార్‌గౌడ్ తదితరులు రేవంత్‌తో మాట్లాడారు. తమ పార్టీ కీలక నేతను అరెస్టు చెయ్యడం, పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చెయ్యడంతో కనీసం ఇలా పార్టీ పేరుతో ఎల్లో ఛార్జ్ షీట్ నైనా దాఖలు చేశారు తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ ని కూడా నెరవేర్చడం లేదని టిటిడిపి నేతలు విమర్శించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chargesheet  TDP  telagana  KCR  Errabelli  Ravula chandrashekar  

Other Articles