Naralokesh | Narachandrababu | Mahanadu | TDP | Gandipet

Nara lokesh apologise to party leaders in mahanadu

Naralokesh, Narachandrababu, Mahanadu, TDP, Gandipet

Nara lokesh apologise to party leaders in mahanadu. In Mahanadu tdp president chandrababu son nara lokesh apology to leaders.

నన్ను క్షమించండి అన్న నారా లోకేష్

Posted: 05/27/2015 04:12 PM IST
Nara lokesh apologise to party leaders in mahanadu

నారా లోకేష్. తన తండ్రి ఏపి సిఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే.. నారా లోకేష్ మాత్రం తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. తన ప్రసంగం ప్రారంభించిన దగ్గరి నుండి ప్రతి లైన్ కు పార్టీ పేరును స్మరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పలానా చేసింది.. పలానా చేయనున్నాం అంటూ బాగా హడావిడి చేశారు. టిడిపి పార్టీ యాభైనాలుగు లక్షల మంది కార్యకర్తల బలాన్ని కలిగి ఉందని, కార్యకర్తలను వారి పిల్లలను పార్టీ తప్పకుండా పార్టీ ఆదుకుంటుందని నారా లోకేష్ వెల్లడించారు. ఇప్పటి వరకు 450 మంది కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు కల్పించామని, కార్యకర్త పిల్లల కోసం స్కిల్ డెవిలప్ మెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.

తన ప్రసంగం ప్రారంభం నుండి నారా లోకేష్ కార్యకర్తల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలే దేవుళ్లు అని సంబోధించారు. కార్యకర్తల పిల్లల కోసం వచ్చే సంవత్సరంలో ఎన్డీఆర్ మోడల్ స్కూల్స
్ ను ఏర్పాటు చెయ్యనున్నట్లు వివరించారు. తెలంగాణలో ఓ స్కూల్, నవ్యాంధ్రలో మరో స్కూల్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. టిడిపి కార్యకర్తల సంక్షేమం కోసం రెండు లక్షల రూపాయలతో ఇన్సూరెన్స్ చేసిందని.. దాన్నే తెలంగాణలో టిఆర్ఎస్ కాపీ కొట్టిందని మండిపడ్డారు. పార్టీ సభ్యత్వ నమోదు సమయంలో కొందరిని తాను ఇబ్బంది పెట్టానని క్షమించాలని కోరారు. పార్టీ సభ్యత్వంలో చురుకుగా పాలుపంచుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు నారా లోకేష్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naralokesh  Narachandrababu  Mahanadu  TDP  Gandipet  

Other Articles