Narachandrababu | NTR | Chanting | mahanadu

Narachandrababu naidu chanting senior ntr name in mahanadu

Narachandrababu, NTR, Chanting, mahanadu

narachandrababu naidu chanting senior ntr name in mahanadu. On mananadu tdp party president narachandrababu chanting ntr name several times.

ఎన్టీఆర్ జపం చేసిన చంద్రబాబు

Posted: 05/27/2015 03:35 PM IST
Narachandrababu naidu chanting senior ntr name in mahanadu

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావ్ నామజపం చేశారు నారా చంద్రబాబు నాయుడు. గండిపేటలో సాగుతున్న మహానాడులో చంద్రబాబు ఎన్డీఆర్ పేరును పదేపదే గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలగు  వారి ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు పెట్టిందే తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు వివరించారు. ఈ మహానాడు విశిష్టత మన నాయకుడు పుట్టిన రోజుగా జరుపుకుంటున్నామని, చరిత్రలో ఎంతో మంది పుట్టారు.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మిగిలిన వాళ్లు కొంత మందేఉండగా  అందులో ఎన్టీఆర్ పేరు ఉంటుంది అని చెప్పడానికి గర్విస్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు. మన నాయకుడు అధికారం కోసమో ఏదో వ్యాపకం కోసమో పార్టీ పెట్లేదని తెలుగు వారి గౌరవాన్ని కాపాడటానికి పార్టీ పెట్టారని వివరించారు. మొత్తానికి ఈ మహానాడులో నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఆర్ జపం చేశారు.

తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టీ రామారావు, బసవతారకం పెళ్లి శుభలేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1942 మే2వ తేదీ చిత్రభాను నామసంవత్సరం వైశాఖ బహుళ విదియ శనివారం నాడు అనూరాధ – నక్షత్రయుక్త మీన లగ్నంలో ఈ వివాహం జరిగింది. కృష్ణాజిల్లా కొమరవోలు గ్రామంలో జరిగిన వివాహానికి ఆహ్వానిస్తూ బసవతారకం తండ్రి కాట్ర చెంచయ్య పేరుతో ముద్రించిన ఈ శుభలేఖ మహానాడు ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యకర్తలంతా శుభలేఖను ఆసక్తితో చూడడం కన్పించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  NTR  Chanting  mahanadu  

Other Articles