encroachers attack madannapet dobighat persons in front of police

Real fight in madannapet over dobhighat issue

encroachers attack madannapet dobighat persons in front of police, dobhi ghat, madannapet, attacks, encourchers, police, Street fight, Madannapet at Hyderabad, New twist, shocking death old city boy, WWW-style street fight, love with the girl, triangular affair, One student die

Strret fight violence in Madannapet at Hyderabad creates chaos. When the situation got out of hand more police troops were summoned

ITEMVIDEOS: పట్టపగలు కబ్జారాయుళ్ల ఆగడం.. మాదన్నపేటలో కలకలం..

Posted: 05/23/2015 10:38 PM IST
Real fight in madannapet over dobhighat issue

హైదరాబాద్లో పట్టపగలు సినిమా ఫైట్ను తలపించేలా స్థానికులపై కబ్జారాయుళ్లు ఆగడాలు సృష్టించారు. వారిని అడ్డుకునేందుకు యత్నించిన వారిపై దాడులకు తెగబడ్డారు. అయితే ఈ మొత్తం తతంగానికి పోలీసులు సాక్ష్యంగా నిలిచారు. శనివారం హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఇరువర్గాలు దాడులు స్తానికంగా కలకలం రేపాయి. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు, సోడా బుడ్డిలతో ఫైట్ చేసుకున్నారు. మాదన్నపేట దోభీ ఘాట్ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ...చిలికి చిలికి గాలివానగా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
 
దోభిఘాట్‌  ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని స్థానికులు అడ్డుకోవడంతో వివాదం  చెలరేగింది. స్థలాన్ని కబ్జా చేసేందుకు మాఫీయ యత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న కబ్జారాయుళ్ల అనుచరులు అక్కడ వీరంగం సృష్టించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపచేసేందుకు ప్రయత్నించినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. పోలీసుల ఎదుటే... కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.  ప్రస్తుతం అక్కడ పరిస్థితి నిలకడగానే ఉన్నా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. గతంలో స్థానిక బస్తివాసులు ఈ వ్యహహారంపై గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dobhi ghat  madannapet  attacks  encourchers  police  

Other Articles