Nestle challenges UP's order on Maggi noodles recall

Nestle asked to withdraw maggi noodles from market

Nestle challenges UP's order on Maggi noodles recall, maggi noodles, nestle company, more lead in maggi, business, Nestle, Maggi, noodles, New Delhi, Maggi, FDA, Monosodium glutamate, Food Safety and Standards Authority of India, Uttar Pradesh

Nestle India Ltd has taken issue with an order from regional food inspectors in Uttar Pradesh to recall a batch of Maggi noodles on the grounds that it contained dangerous levels of lead.

యూపీ అదేశాలపై తేల్చుకునేందుకు సిద్దమైన మేగీ

Posted: 05/21/2015 09:32 PM IST
Nestle asked to withdraw maggi noodles from market

చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నోరూరించే ఇష్టకరమైన వంటకంగా, రెండు నిమిషాల్లో తయారు చేసుకుని.. ఇష్టంగా తినే మేగీ నూడుల్స్కు ఉత్తర్ ప్రదేశ్ అధికారుల అదేశాలపై తేల్చుకునేందుకు సిద్దమయ్యింది. ఉత్తర్ ప్రదేవశ్ అధికారులు పరీక్షలు జరిపి మ్యాగీలో అత్యధికంగా సీసం, మోనో సోడియయం గ్లుటామెట్ వున్నాయని తేల్చిన రెండు లక్ష్ల ప్యాకెట్లు గత ఏడాది ఫిబ్రవరిలో ఉత్సత్తి చేశామని, కాగా వాటి గడువు గత ఏడాది నవంబర్ మాసంతో తీరిపోయిందని మ్యాగీ సంస్థ తెలిపింది. ఈ విషయంలో సంబంధిత అధికారుల వద్ద తేల్చుకునేందుక కూడా నెస్ట్లీ సంస్థ సిద్దమైంది. కాగా అ ఒక్క బ్యాచ్ తప్ప మిగతా బ్యాచ్ లలో ఉత్సత్తైన మ్యాగీ పై అధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని నెస్ట్లీ సంస్థ తెలిపింది.

అయితే మ్యాగీ కికష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మేగీని తయారుచేసే నెస్లె కంపెనీపై కఠిన చర్యలకు దిగేలా కనిపిస్తోంది. దాదాపు 2 లక్షల ప్యాకెట్లతో కూడిన బ్యాచ్ని మార్కెట్ల నుంచి ఉపసంహరించాలని ఆదేశించిన ఎఫ్డిఏ.. ఇప్పుడు మరిన్ని బ్యాచ్లను కూడా పరీక్షిస్తోంది. వాటిలో అనుమతించిన స్థాయి కంటే ఎక్కువ మోతాదులో సీసం, ఆహారంలో ఉపయోగించే రంగులు ఉన్నాయని ఎఫ్డీఏ తేల్చింది. రుచిని పెంచేందుకు మోనో సోడియం గ్లుటామేట్ (ఎంఎస్జీ) అనే రసాయనం చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్లు ఎఫ్డీఏ కనుగొంది. దాంతోపాటు సీసం కూడా ఎక్కువగానే ఉన్నట్లు తేల్చింది.

దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదలైన మరో మూడు నాలుగు బ్యాచ్లను కూడా యూపీ ఎఫ్డీఏ పరీక్షిస్తోంది. ఈ పరీక్ష ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఆ నివేదికలో కూడా తేడా కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని బారాబంకి జిల్లా ఆహార అధికారి వీకే పాండే తెలిపారు. ఆహార పదార్థాల్లో సీసం పరిమాణం కేవలం 2.5 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) మాత్రమే ఉండాలని నిబంధనలుండగా.. మేగీలో ఏకంగా 17.2 పీపీఎం ఉందని ఆయన చెప్పారు. అయితే, ఈ నివేదికలను నెస్లే సంస్థ కొట్టిపారేస్తోంది. తాము ఓ స్వతంత్ర సంస్థతో మళ్లీ పరీక్షలు చేయిస్తున్నామని.. దాని ఫలితాలు వచ్చిన తర్వాత వాటిని కూడా అధికారులకు సమర్పిస్తామని చెబుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maggi noodles  nestle company  more lead in maggi  monosodium glutamate  

Other Articles