Man who opened fire, robbed a woman at ATM in Hyderabad held

Robbery inside atm accused arrested

young women attacked near atm, attacks in atm, attacks near atm, sbi atm, Hyderabad, ATM, Robbery, state bank of india ATM, crime in yousufguda, crime in Hyderabad, atm robbery in yousufguda, gunfire in atm, Firing, yousufguda, sbi atm centre, sr nagar police

The accused in the atm heist has been arrested by police, who accosted a young woman inside the SBI ATM at Yusufguda and robbed her valuables, phone and money

ITEMVIDEOS: ఏటీయంలో కాల్పుల కేసు.... నిందితుడు అరెస్టు

Posted: 05/21/2015 09:28 PM IST
Robbery inside atm accused arrested

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన యూసఫ్ గూడ ఏటీఎం దోపిడీ కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చాకచక్యంగా చేధించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డిగా తేల్చారు.  గత మూడేళ్లుగా ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉంటూ శివకుమార్ రెడ్డి నేరాలకు పాల్పతున్నాడని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. జల్సాలకు అలవాటుపడి అతడు వక్రమార్గం పట్టాడని చెప్పారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా అతన్ని పట్టుకున్నామని వెల్లడించారు.

యూసఫ్ గూడ ఏటీఎంలో చొరబడి నాటు తుపాకీతో యువతిని బెదిరించి ఏటీఎం కార్డు, ఆభరణాలు ఎత్తుకుపోయాడన్నారు. యువతిని భయపెట్టేందుకు తుపాకీతో పక్కకు కాల్చాడని వెల్లడించారు. తన తెలిసిన వారి సహకారంతో మహారాష్ట్రలో ఈ తుపాకీ కొనుగోలు చేసినట్టు నిందితుడు చెప్పాడని కమిషర్ మహేందర్ రెడ్డి తెలిపారు. కేసును సీరియస్ గా తీసుకుని 24 గంటల్లో ఛేదించామన్నారు. అతడి వద్ద నుంచి 3 ఏటీఎం కార్డులు, 5 సెల్ ఫోన్లు, బంగారపు గొలుసు, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హాస్టల్స్ లో చేరే వారి విషయంలో హాస్టల్స్ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఏటీఎం కేంద్రాల్లో తప్పనిసరిగా సెక్యురిటీ ఉండాలని, క్వాలిటీ సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించినట్టు కమిషనర్ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ATM  Robbery  state bank of india ATM  sr nagar police  

Other Articles