Telangana | RTC | KCR | Harishrao | Fitment

Telangana irrigation minister harish rao complement on cm kcr for rtc fitment

Telangana, RTC, KCR, Harishrao, Fitment

Telangana irrigation minister Harish Rao complement on cm kcr for rtc fitment. He said that cm kcr decided to announce fitment after rtc bifercation.

చరిత్రలో ఆర్టీసీ ఫిట్ మెంట్.. మామకు అల్లుడి బాజా

Posted: 05/20/2015 08:22 AM IST
Telangana irrigation minister harish rao complement on cm kcr for rtc fitment

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్ మెంట్ ప్రకటించి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఐతే కేసీఆర్ ఫిట్ మెంట్ ప్రకటన చరిత్రలో నిలిచిపోతుందని కేసీఆర్ అల్లుడు, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావ్ వెల్లడించారు.  రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల పోరాట పటిమ, స్ఫూర్తి, తెగువ సీఎం కే చంద్రశేఖర్‌రావు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. అందుకే ఆర్టీసీ కార్మికులు అడిగిన దానికంటే ఒకశాతం ఎక్కువ ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ ప్రకటించి చరిత్ర సృష్టించారన్నారు. దేశంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలోనూ కార్మికులు అడిగినంత వేతన సవరణ జరిగిన చరిత్ర లేదని చెప్పారు.

నిజానికి ఆర్టీసీ విభజన పూర్తయిన తర్వాత కార్మికులు సమ్మెకు వెళ్లకుండానే తెలంగాణ కార్మికులకు ఫిట్‌మెంట్ ప్రకటించాలని సీఎం కేసీఆర్ భావించారని హరీష్ రావు వెల్లడించారు. గతంలో రవాణశాఖ మంత్రిగా పనిచేసిన సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు పూర్తిగా తెలుసునని చెప్పారు. సమస్యలన్నీ పరిష్కారమైనందున ఆర్టీసీ కార్మికులు గంట అదనంగా పనిచేసి సంస్థను లాభాల్లోకి తేవాలని కోరారు. ఆయన నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేసి 2017 మార్చి నెలాఖరుకల్లా వేతన సవరణ పొందాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు ఇండ్ల స్థలాలపై త్వరలో ఓ ప్రకటన చేస్తారని తెలిపారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  RTC  KCR  Harishrao  Fitment  

Other Articles