Jr. ntr | srinidhi | ntr fan | died

Jr ntr fan srinidhi died srinidhi parents conformed the srinidhi dath news last week jr ntr met srinidhi in the hospital

Jr. ntr, srinidhi, ntr fan, died

Jr. NTR fan srinidhi died. Srinidhi parents conformed the srinidhi dath news. last week jr. ntr met srinidhi in the hospital.

చిన్నారి శ్రీనిధి కన్నుమూత.. గత వారం పరామర్శించిన ఎన్టీఆర్

Posted: 05/20/2015 08:15 AM IST
Jr ntr fan srinidhi died srinidhi parents conformed the srinidhi dath news last week jr ntr met srinidhi in the hospital

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గత వారం ఆస్పత్రిలో పరావర్శించిన చిన్నారి శ్రీనిధి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శివాజీ, క్రాంతి కుమారిల కూతురు శ్రీనిధి గత మూడేళ్లుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది. శ్రీనిధి ఎన్టీఆర్ ఫ్యాన్ కావడంతో అతడిని చూడాలని ఆశపడుతోంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఆ పాప కోరికను తల్లిదండ్రులు పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అమ్మాయిని పరామర్శించి చాక్లెట్ల్, ఆటబొమ్మలు ఇచ్చారు. ఆ అమ్మాయి త్వరగా కోలుకుని మన మధ్య ఆరోగ్యంగా తిరగాలని కోరుకుంటున్నానని, ఆ అమ్మాయి చికిత్స ఖర్చులు భరిస్తానని ఆయన  అన్నారు.

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లికి చెందిన శివాజీ, క్రాంతికుమారిలకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, వాళ్లలో శ్రీనిధి పెద్దకుమార్తె. ఆమెకు ఆరాధ్య, అలేఖ్య అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.  శ్రీనిధికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. ఆయన నటించిన యమదొంగ సినిమా ఆమెకు బాగా గుర్తు. ఎన్టీఆర్ తనను చూసేందుకు వచ్చినప్పుడు కూడా యమదొంగ సినిమా గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించింది. తాను చిన్నారి శ్రీనిధి బాధను తీర్చలేకపోయినా.. కనీసం తనను చూడాలన్న ఆమె చివరి కోరికనైనా తీర్చగలిగానని ఎన్టీఆర్ ఆరోజు ఎంతగానో బాధపడ్డారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr. ntr  srinidhi  ntr fan  died  

Other Articles