LAWcet | exam | telangana | Kakatiya University

Kakatiya university did all arrangements for tlawcet exam

LAWcet, exam, telangana, Kakatiya University

Kakatiya university did all arrangements for TLAWcet exam. In telangana total 30 exam centers for the written exam.

టి.లాసెట్ పరీక్ష నేడే.. అన్ని ఏర్పాట్లు పూర్తి

Posted: 05/19/2015 08:44 AM IST
Kakatiya university did all arrangements for tlawcet exam

తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ ప్రవేశ పరీక్ష నేడు జరగనుంది. కాకతీయ యూనివర్సిటీ    ఆధ్వర్యంలో జరగనున్న టీఎస్ లాసెట్‌కు 28.. పీజీ లాసెట్‌కు 2  మొత్తం 30 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. తొమ్మిది రీజియన్ సెంటర్లు వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండలో మూడేళ్ల లా కోర్సుకు 13,502 మంది.. ఐదేళ్ల లా కోర్సుకు 4,257 మంది.. ఎల్‌ఎల్‌ఎంకు 1532 మంది అభ్యర్థులు మొత్తం 19,291 మంది పరీక్ష రాయనున్నారు. మూడేళ్ల లా కోర్సు, ఐదేళ్ల లా కోర్సు ప్రవేశ పరీక్ష నేటి ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పీజీ లాసెట్, ఎల్‌ఎల్‌ఎం కోర్సు ప్రవేశాలకు ఈ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరగనుంది.

లాసెట పరీక్ష నిర్వహిస్తున్న మొత్తం 30 పరీక్షకేంద్రాలకు 30మంది చీఫ్‌సూపరింటెండెంట్‌లు,  50మందికిపైగా అబ్జర్వర్లతోపాటు స్పెషల్ అబ్జర్వర్లను కూడా నియమించారు. అభ్యర్థు లు పరీక్ష కేంద్రాలకు పరీక్ష టైం కంటే కంటే ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్కనిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోపలకు అనుమతించమని అధికారులు తేల్చిచెప్పారు. ఈనెల22న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 25వ తేదీవరకు అభ్యంతరాలను స్వీకరించి,  జూన్ 5న లాసెట్ ప్రవేశపరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LAWcet  exam  telangana  Kakatiya University  

Other Articles