Jayalalitha | illness | media | news

Ayalalitha suffering with illness

Jayalalitha, illness, media, news

Jayalalitha suffering with illness. Tamilnadu famous amma suffering with illness.

జయలలితకు అనారోగ్యం..!

Posted: 05/19/2015 09:25 AM IST
Ayalalitha suffering with illness

తమిళనాడులో అమ్మగా పేరుపొందిన జయలలితకు అనారోగ్యంగా ఉంది అని వార్తలు వెల్లువెత్తాయి. అక్రమాస్తుల కేసులో తాజాగా విడుదలైన జయలలిత ఆరోగ్యం బాగోలేదని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు జయలలిత తీవ్ర వత్తిడి కారణంగా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. కర్ణాటక తీర్పు వెలువడిన తర్వాత జయలలిత, ఆమె అనుచరులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే కోర్టు కేసు, తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల లేదా అన్న సందిగ్దంలో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. అయితే నిజంగా జయలలితకు అనారోగ్యంగా ఉందా లేద పుకారా అన్న దానిపై క్లారిటీ లేదు.

అయితే కర్ణాటక హైకోర్ట్ జయలలితను నిర్దోశిగా విడుదల చేసిన తర్వాత తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈనెల 22వ తేదీన పార్టీ శాసనసభ్యుల సమావేశం తరువాత జయను సీఎం పీఠం ఎక్కించడం ఖాయమని దాదాపు తేలిపోయింది. ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలో ఆమె ఎమ్మెల్యేగా గెలిచేందుకు వీలుగా చెన్నైలోని ఆర్కేనగర్ నియోజకవర్గం సిద్ధమైంది. ఆర్కేనగర్ ఖాళీగా ఉన్నట్లు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సందీప్ సక్సేనా ప్రధాన ఎన్నికల కమిషన్ కు  సమాచారం అందించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalitha  illness  media  news  

Other Articles