Sandalwood Smuggler Mukesh Badani Says Some Interesting Comments About Smuggling | Chandrababu Naidu AP State

Sandalwood smuggler mukesh badani interesting comments chandrababu naidu ap state

Mukesh badani, sandalwood smuggling, ap cm chandrababu naidu, sandalwood business, ap state controversy, smuggling cases, ap govt, tdp party ministers, sandalwood controversy, mukesh badani interview, mukesh badani controversy

Sandalwood Smuggler Mukesh Badani Interesting Comments Chandrababu Naidu AP State : Mukesh Badani Who Caught In Sandalwood Smuggling makes some interesting comments about in this case. He took permission from ap cm chandrababu and govt to run this business.

ఆ స్మగ్లర్.. చంద్రబాబుకు చెప్పే ‘ఎర్ర’ వ్యాపారం చేశాడట!

Posted: 05/18/2015 10:46 AM IST
Sandalwood smuggler mukesh badani interesting comments chandrababu naidu ap state

ఆంధ్రరాష్ట్రంలో ‘ఎర్రచందనం’ స్మగ్లింగ్ వ్యవహారాం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు చాకచక్యంగా తమ దర్యాప్తును ప్రారంభించారు. ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నవారెవరో కూపీలాగి.. దీని వెనుకున్న బడాబాబులను సైతం పట్టుకోవడంలో సమర్థవంతంగా తమ పనిని నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నాడన్న అనుమానంతో ముఖేష్ బదానీ అనే వ్యక్తిని పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణాలో ముఖేష్ హస్తం కూడా వుందన్న అనుమానంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈరోజు (సోమవారం) ఉదయం కోర్టుకు హాజరుపరిచే నిమిత్తం కడపకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగానే ఓ ప్రైవేట్ టీడీ ఛానెల్ తో మాట్లాడిన బదానీ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తాను ఎర్రచందనం విక్రయిస్తున్న మాట వాస్తవమేనని.. కానీ తన వ్యాపారం అక్రమం కాదని తెలిపాడు. తాను పూర్తి స్థాయిలోనే ఈ వ్యాపారాన్ని చట్టబద్ధంగానే కొనసాగిస్తున్నట్లుగా బదానీ చెప్పాడు.

అంతేకాదు.. ఈ వ్యాపారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడకు దరఖాస్తు చేసుకుని, ప్రభుత్వ అనుమతి తీసుకున్నానని బదానీ పేర్కొన్నాడు. దీంతో ఇది సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం చాలా ఉత్కంఠగా నెలకొంది. మరోవైపు.. బదానీని విచారిస్తే.. ఎర్రచందనం స్మగ్లింగ్ లో కీలక నిందితుల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు వాదిస్తున్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల హస్తం వుండవచ్చునని వారు భావిస్తున్నట్లు సమాచారం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mukesh Badani  Sandalwood Smuggling  Chandrababu Naidu  

Other Articles