modi and mini modi are doing nothing for farmers says rahul gandhi

Rahul gandhi takes on centre on land bill

rahul gandhi takes on centre on land bill, land bill, narendra modi, Prime minister, chief minister, kcr, farmers, padayatra, vadyal meeting, mini modi, kisan sandesh yatra, cintroversial comments, mahatma gandhi, father of the nation, power politics

rahul gandhi takes on centre and kcr says modi and mini modi are doing nothing for farmers

మీ భూములపై హక్కులు మీవా..? వాళ్లవా..? బీజేపీకే అచ్చే దిన్

Posted: 05/15/2015 10:08 PM IST
Rahul gandhi takes on centre on land bill

రైతులకు నిత్యం అండగా వుండేది కాంగ్రెస్ పార్టీయేనని, అవసరమైతే.. రైతుల కోసం పార్లమెంటులో పోరాడతానని, అంతేకాదుఎక్కడ ఉద్యమించడానికైనా తాను సిద్దమని రాహుల్ గాంధీ రైతులకు, రైతు కూలీలకు హామీ ఇచ్చారు. మీ భూముల మీధ హక్కులు మీకు తప్ప మరెవరీ వుండబోమని మిమ్మల్ని అడగకుండానే మీ భూములు లాగేసుకునే అధికారం ఎవరికీ లేదని రైతులను ఉద్దేశించి అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో నిర్వహించిన రైతు భరోసా యాత్రకు పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. నిర్మల్ ప్రాంతంలో 15 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన అనంతరం రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా వడ్యాలలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

 దేశాన్ని ప్రతి పౌరుడూ ముందుకు తీసుకెళ్తాడు. కానీ అందరికంటే ప్రముఖస్థానం రైతులు, కూలీలది. ఎందుకంటే వాళ్లే తమ చెమట, రక్తం ధారపోసి దేశాన్ని సుసంపన్నం చేస్తారన్నారు. తాను ఈ ఒక్కరోజు ఎండలో నడిచాను గానీ, రైతులు జీవితాంతం ఎండలోనే పనిచేస్తుంటారని.. వారు పనిచేయబట్టే దేశంలో ప్రతి ఒక్కరికీ ఆహారం పూర్తిగా లభిస్తోంది. వాళ్లు రోజు చెమటోడుస్తుంటారు. కానీ అప్పుడప్పుడు వాతావరణ ప్రతికూలత కారణంగా వారికీ సాయం అవసరం అవుతుందని..అయన చెప్పారు. నీళ్లు, కరెంటు, ఎరువులు లేకుండా రైతులు తమ వ్యవసాయం చేసుకోలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏ చిన్న కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే వెళ్లి ఆదుకునేవాళ్లమన్నారు.

మహారాష్ట్రలో, బుందేల్ఖండ్లో కరువు వచ్చినప్పుడు యూపీఏ సర్కారు వెంటనే సహాయ ప్యాకేజి అందించిన ఘనత తమదేనన్నారు. రైతులకు కనీస మద్దతుధరను ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చేవాళ్లమన్నారు. దేశ చరిత్రలో  70వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతులందరికీ బ్యాంకు రుణాలు అవసరమని తెలసి... కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో 8 లక్షల కోట్ల రుణాలు అందించామన్నారు. వాటి ద్వారా 6.5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.

రాబోయే కాలంలో భూమి విలువ బాగా పెరుగుతుందని... పెద్దపెద్ద నగరాలకు సమీపంలో ఉన్న భూముల ధరలు బాగా పెరుగుతాయని చెప్పారు. ఒకప్పుడు వేలల్లోనే ఉన్న భూమి ధర ఇప్పుడు లక్షల్లో ఉంది, రేపు కోట్లు పలుకుతుంది.. కొన్నాళ్ల తర్వాత పదుల కోట్లకు చేరుకుంటుందన్నారు. రైతులకే భూమి మీద హక్కు ఉండాలని కాంగ్రెస్ భావించిందని, రేట్లు పెరిగినప్పుడు ఆ ప్రయోజనం రైతుల వారసులకే చెందాలని అనుకుని ఎంతో అలోచించి భూసేకరణ బిల్లు ప్రవేశపెట్టామనన్నారు.. దానివల్ల మీ భూములకు మంచి రేటు దక్కేదన్నారు. అందుకోసం ఆ చట్టంలో మరో మూడు ముఖ్యమైన అంశాలను పోందుపర్చామన్నారు

రైతలు నుంచి పారిశ్రామిక వేత్తలు భూమి తీసుకుంటే.. వాళ్లను అడిగి తీసుకోవాలని ఉంది. నగరంలో ఎవరైనా భూములు అమ్మితే ఎవరినీ అడగకుండానే అమ్మేస్తారు. రైతులకు కూడా అలాంటి హక్కులు ఉండాలి. ఐదేళ్లలోపు తీసుకున్న భూమిలో ప్రాజెక్టు ప్రారంభం కాకపోతే ఆ భూమి రైతులకే తిరిగివ్వాలని మేం చట్టంలో పెట్టాం. ఎవరి భూమి తీసుకున్నా సోషల్ ఆడిట్ జరిగి తీరాలని, ఎవరికి ఇబ్బంది కలుగుతుందో ఆరు నెలల్లో చెప్పాలని నిబంధనను కూడా పోందుపర్చామన్నారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో వున్న ఎన్డీయే ప్రభుత్వం.. అతి కీలకమైన ఈ మూడు అంశాలను సవరించిందని.. ఇప్పుడు మీ భూమి తీసుకునే అధికారం వారికి వుంటుందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు లోపలా. బయటా ఉద్యమిస్తుందని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, తెలంగాణలో మినీ మోదీ ప్రజల కోసం ఏమీ చేయడంలేదని.. కేవలం తమకు కావల్సిన నలుగురైదుగురి కోసమే చేస్తున్నారని రాహుల్ విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ చురకలు..

* మీలో ఎవరైనా ఎప్పుడైనా 10 లక్షల సూటు వేసుకున్నారా? మోదీ వేసుకుంటారు. వాళ్లు నిజానికి ఇక్కడున్న పేదలను పరామర్శించడం మర్చిపోతుంటారు.
* అకాల వర్షాలు, వడగళ్లు వచ్చినా ఇక్కడ కేసీఆర్కు, అక్కడ మోదీకి రైతులను పలకరించడానికి సమయం లేదు.
* మోదీ మద్దతుధర పెంచుతామన్నారు, కేసీఆర్ రుణమాఫీ చేస్తామన్నారు. ఇద్దరూ ఏమీ చేయలేదు
* ఎక్కడో ఎవరో ఆత్మహత్య చేసుకుంటే నేనెందుకు పరామర్శించాలని బీజేపీ వాళ్లంటారు. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ రైతుల కుటుంబాలను పరామర్శిస్తే నేను వెళ్లి చూడాల్సిన అవసరం ఉండదు. వాళ్లే రైతులను కౌగలించుకుంటే.. నేను కౌగలించుకోవాల్సిన అవసరం ఉండదు.
* రైతులారా.. మీరు భయపడొద్దు. మీ తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మీకు ఏ కష్టం వచ్చినా మేం అండగా ఉంటాం.
* పార్లమెంటులోను, వీధుల్లోను కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మేం పోరాడతాం.
* మేం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. కానీ రైతుల భూములను మాత్రం లాక్కోకూడదు.
* భారతదేశాన్ని కేవలం పారిశ్రామికులు, రైతులు మాత్రమే కాదు.. ఇద్దరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలి.
* క్రోనీ కేపిటలిజానికి మేం వ్యతిరేకం. దాని అర్థం ఏంటంటే.. ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకే మొత్తం కట్టబెట్టేయడం. దానికి మేం వ్యతిరేకం.
* రైతులు, కూలీలు, పేదలు.. అందరికీ వాళ్ల హక్కు దక్కాలనే కోరుకుంటున్నాం.
* దేశంలోను, తెలంగాణలోను కొంతమందికే ప్రభుత్వాలు పరిమితం అయిపోయాయి. మోదీకి ఐదారుగురు బడా మిత్రులున్నారు. ఆయనతో పాటు వాళ్లు విదేశాలకు వెళ్తారు. మొత్తం భారతదేశాన్ని అక్కడ తాకట్టు పెడుతున్నారు.
* నేను పార్లమెంటులో చెప్పినట్లు ఇది రైతు ప్రభుత్వం కాదు.. సూటుబూటు ప్రభుత్వం. కొద్దిమందికి మాత్రమే 'అచ్ఛేదిన్' వచ్చాయి.
* భారతదేశంలో రైతులు, రైతు కూలీలు, చిన్న వ్యాపారులకు అచ్చే దిన్ ఏదీ..?
* కేవలం 8 శాతం ప్రాజెక్టులే భూములు లేక ఆగాయి తప్ప మిగిలినవన్నీ వేరే కారణాలతో ఆగాయి. ఇప్పుడు భూమి అంటే బంగారం. రాబోయే కాలంలో మీకు, మీ పిల్లలకు ఇది శాశ్వతంగా ఉపయోగపడుతుంది.
* వీలైనంత త్వరగా వాళ్లకు కావల్సిన పారిశ్రామికవేత్తలకు ఈ భూములు కట్టబెడదామని ప్రయత్నిస్తున్నారు.
* వాళ్లు మీకు ఉపాధి కల్పిస్తామని, మేకిన్ ఇండియా చేస్తామని అంటున్నారు కానీ అందులో ఏమీ జరగట్లేదు. ఏడాది గడిచిపోయినా తెలంగాణ ప్రభుత్వం గానీ, మోదీ ప్రభుత్వంగానీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా?
* మోదీగారు అచ్ఛేదిన్ వస్తాయని అంటున్నారు.. ఆయన చైనాలో ఉన్నారు. మొన్న అమెరికా, ఆస్ట్రేలియా తిరిగారు. ఆయనకే మంచిరోజులు వచ్చాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  padayatra  vadyal meeting  mini modi  

Other Articles