Major Hike In Fuel Prices, Petrol Goes Up By Rs 3.13, Diesel By Rs 2.71

Petrol prices hiked by rs 3 13 a litre diesel by rs 2 71

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency, new delhi price, modi government, dharmendra pradhan, indian petroleum price, business, economy, finance

In another jolt for second time in May, petrol prices were on Friday raised by Rs 3.13 per litre and diesel by Rs 2.71, tracking the global cues. It was the second major hike of this month.

వాహనదారుల చేదువార్త.. మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

Posted: 05/15/2015 06:49 PM IST
Petrol prices hiked by rs 3 13 a litre diesel by rs 2 71

వాహనదారులకు మళ్లీ చేదు వార్త. అంతేకాదండోయ్ ఇకపై మళ్లీ నిత్యవాసర సరుకుల ధరలు కూడా భగ్గుమననున్నాయి. వేసవి వేడితోనే అల్లాడుతున్న దేశ ప్రజలపై మరోమారు చమురు సంస్థలు అదనపు భారం వేసి వేడిని అధికం చేశాయి. మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలు వినడంతోనే భగ్గుమనే రోజులు మళ్లీ వచ్చాయి. ఆసియా మార్కట్లో క్రూడ్ అయిల్ ధరలు తగ్గుతున్నా.. దేశీయ చమురు సంస్థలు మాత్రం ఇంధన దరలకు రెక్కలు కల్పిస్తున్నాయి. ఇంధన సంస్థల ఒత్తిడికి లోనైవుతున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సమ్మతించడంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ఒక్క మే నెలలోనే రెండు పర్యాయాలు ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.13, డీజిల్‌పై రూ.2.71 చొప్పున ధరలు పెంచుతున్నట్లు ఇంధన కంపెనీలు ప్రకటించాయి. తాజా రేట్లు అములుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రల్‌ ధర రూ.63.16 నుంచి రూ. 63.16కు పెరగింది. డీజిల్‌ ధర రూ.49.57 నుంచి రూ.49.57కు పెరగింది.

గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ క్రమంగా తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు మొత్తంగా  పది సార్లు తగ్గింపులతో పెట్రోల్‌ రూ.17.11, డీజిల్‌ రూ.12.96 మేర తగ్గాయి. అయితే.. ఆ తరువాత మార్చి ఒకటో తేదీన పెట్రోల్‌పై రూ.3.18, డీజిల్‌పై రూ.3.09 చొప్పున పెంచారు. తాజాగా ఇవాళ మరో మారు ఇంధన ధరలను పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకోవడంతో.. మే మాసంలో ఇంధన ధర సుమారుగా పెట్రోలు లీటరుకు ఏడు రూపాయల మేర, డీజిల్ లీటరుకు ఐదున్నర రూపాయల మేర పెరిగింది. దీంతో నిత్యవసర సరుకుల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి. ఏకంగా పక్షం రోజుల వ్యవధిలో డీజిల్ ధరలు ఆరు రూపాయల మేర పెరగడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఏప్రిల్‌ ద్వితీయార్థంలో డాలర్‌- రూపాయి మారకం విలువ అంతకు ముందు కంటే ఎక్కువగా ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణాల్లో ఒకటని చెప్పొచ్చు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol price  Petrol price hike  Diesel price hike  Fuel prices  Brent crude price  

Other Articles