sand | sudama devi | eating | uttarpradesh

An old lady eating sand every day in uttarpradesh

sand, sudama devi, eating, uttarpradesh

Sudama Devi first tried sand when she was 10 for a dare - but now she can't stop eating it This sprightly elderly lady claims to be super healthy - despite a bizarre addiction to eating sand.

ఇసక తినే బామ్మ.. అది కూడా రోజుకు కిలో

Posted: 05/15/2015 11:41 AM IST
An old lady eating sand every day in uttarpradesh

మనం తినేదాంట్లో ఏదైనా ఇసక రాయి వస్తే.. అబ్బో అంతే.. అమ్మ మీద కేకలు వేస్తాం.. ఏం చేస్తున్నావ్.. చూసుకోవా అని మండిపడతాం. అలాంటి ఇసకనే అన్నంలాగా, బిర్యానీ లాగా కడుపునిండా తిను నాయనా అంటే ఖచ్చితంగా పిచ్చిపట్టింది డౌటే లేదు అని అనుకుంటాం. కానీ రోజుకు ఓ కిలో ఇసక తినే ఓ బామ్మ గురించి వింటే మీరు షాక్ అవుతారేమో మరి. ఏంటీ బామ్మంటున్నారు మళ్లీ ఇసక తింటుంది అంటున్నారు అనుకుంటున్నారేమో కానీ మేం చెబుతోంది అక్షరాల నిజం. బామ్మ అంటేనే పళ్లు ఊడి ఉంటాయి కాస్త గట్టి పదార్థాలు ఇస్తేనే తినడానికి రాదు కదా అలాంటిది ఇసకను ఎలా తింటుంది అని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవండి.

 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ పూర్ జిల్లా కజిర్ నూర్ పూర్ గ్రామానికి చెందిన సుధామ దేవి కి ఇప్పుడు 92 ఏళ్లు. రోజుకు నాలుగు ప్లేట్లు ఇసుకను అవలీలగా తిని ఆరగించుకుంటోంది.ఈ బామ్మ కేవలం ఇసుక తిని బతుకుతోంది. నిజం..రోజుకు కిలో ఇసుక తిని దిట్టంగా వుంది. ఈ అమ్మమ్మకి ఎలాంటి రోగాలు లేకపోవడం మరో విశేషం.  చిన్నప్పుడు ఏదో షరతు కోసం తినడం ప్రారంభించిన సుధామ, ఇప్పటికీ అదే అలవాటును కొనసాగిస్తోంది. పెళ్లికి ముందు తండ్రి, తరువాత భర్త ఈ ఇసుక తిండి అలవాటును లైట్ గా తీసుకున్నారు. బామ్మకి మొత్తం పదిమంది సంతానం. ఇప్పటివరకు అకలి, రోగాలను దరికి చేరనియ్యలేదట. అయితే ఈ బామ్మలాగా ఎవరికీ ఇసక తినే అలవాటు మాత్రం రాలేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sand  sudama devi  eating  uttarpradesh  

Other Articles