media | rahul | padayathra

Telugu media over coverage of rahul gandhi padayathra

media, rahul, padayathra, adilabad, telugu, farmers

Telugu Media over coverage of rahul gandhi padayathra. Aicc vice president Rahul gandhi begins his Padayathra in adilabad dist. Telugu media covering over on rahul padayathra.

అబ్బో.. రాహుల్ ను బాగా కవర్ చేస్తున్నారు

Posted: 05/15/2015 10:25 AM IST
Telugu media over coverage of rahul gandhi padayathra

తెలుగు మీడియా ఛానల్స్ చేసే హడావిడి అంతాఇంతా కాదు. చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా బ్రేకింగ్ న్యూస్ అంతా బూతద్దంలో పెట్టి చూపించడం అలవాటైంది. తాజాగా ఏఐసిసి ఉపదాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న రైతు భరోసా యాత్రపై కూడా విపరీతమైన కవరేజ్ చేస్తోంది. రాహుల్ గాంధీ ల్యాండైన దగ్గరి నుండి ప్రతి నిమిషం ఏం చేస్తున్నారని అంటూ లైవ్ అప్ డేట్ చేస్తోంది. తర్వాత రాహుల్ పలానా దగ్గరికి వెళుతున్నాడు అంటూ ఏకంగా బ్రేకింగ్ న్యూస్ పెట్టిమరీ జనాలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. మీడియా అంటే వార్తలు అందించడం అయితే అది జనాలకు ఏమో కానీ పార్టీ ప్రచారాలకు పనికివచ్చేలా ఉంటున్నాయి.

రాహుల్ గాంధీ యాత్ర గురించి అప్ టు మినిట్ లైవ్ లో కవరేజ్ చేస్తున్న తెలుగు మీడియా నేషనల్ మీడియాను అనుసరిస్తోంది. అయితే వాళ్లు రైజ్ చేసే పాయింట్లు, కవర్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ తెలుగు మీడియా వాళ్లకు అంత సినిమా లేకున్నా బిల్డప్ మాత్రం బాగా ఇచ్చుకున్నారు. దాదాపుగా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ సొంత ఛానల్స్ లాగా భలే కవర్ చేస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ పర్యటన సాగుతున్నందున పార్టీ గతంలో చేసిన పనులు, రైతుల సమస్యలు, ఆత్మహత్యలు, గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎంత మంది చనిపోయారు, దానికి గల రీజన్స్ ఇలా ఎంతో విశాలంగా చర్చించాల్సిన అంశాలను గాలికి వదిలేసి రాహుల్ నడుస్తున్నాడు... రాహుల్ కూర్చుకున్నాడు.. బాబు బాగా బిజీగా ఉన్నాడు.. నవ్వాడు.. ఏడ్చాడు లాంటి ఏడుపుగొట్టు జర్నలిజం చేస్తున్నారు. మరి తెలుగు మీడియా కవరేజ్ రాహుల్ గాంధీకి ఎంత మాత్రం కలిసివస్తుందో తెలియదు మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : media  rahul  padayathra  adilabad  telugu  farmers  

Other Articles