No photos of politicians except President and PM in government ads, says Supreme Court

Pm president chief justice can feature in government ads says sc

No photos of politicians except President and PM in government ads, Prime Minister, narendra modi, President, Pranab mukharjee, supreme court judge, supreme court, chief justice of India, SC, CJI, government ads, guidelines on regulation of public advertisements, Justice Ranjan Gogoi, three-member committee to regulate public advertisement, academician Prof N R Madhava Menon, misuse" of public funds in advertisements

The Supreme Court on Wednesday issued a slew of guidelines on regulation of public advertisements and said that they can carry pictures of certain dignitaries like the President, Prime Minister and the Chief Justice of India.

ప్రభుత్వ ప్రకటనల్లో రాజకీయనేతల ఫోటోలకు చెల్లుచీటి..

Posted: 05/13/2015 04:54 PM IST
Pm president chief justice can feature in government ads says sc

కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో రాజకీయ నేతలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు ఇలా ఎవరెవరి ఫోటోలను ప్రచురించేందుకు వీలు లేదని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తాజాగా అదేశాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రభుత్వ ప్రకటనలలో.. కేవలం రాష్ట్రపతి,  ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ( భారత ప్రధాన న్యాయమూర్తి, అనగా సీజేఐ) పోటోలు మాత్రమే ప్రచురించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన వ్యవహారాలలో న్యాయస్థానాల జోక్యం చేసుకోవద్దని కోరిన కేంద్రం వాదనను జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఫ్రభుత్వ ప్రకటనల జారీలో ఒక విధానం కానీ, చట్టం కానీ లేవని అందుచేత న్యాయస్థానానికి వాటిలో జోక్యం చేసుకునే అధికారం వుందని దర్మాసనం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలలో ఎవరి ఫోటోలనూ ప్రచురించరాదని ప్రముఖ విద్యావేత్త ఫ్రోఫెసర్ ఎన్ ఆర్ మాదవ మెనన్ చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చుతూ ఈ మేరకు తీర్పును వెలువరించింది. వివిధ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై సుప్రీం కోర్టు బుధవారం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి సంబంధించి త్రి సభ్య కమిటీని వేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆయా ప్రకటనల పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ  నియమించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఫోటోలు కూడా వాడరాదని స్పష్టం చేసినట్టయింది. ప్రభుత్వం ప్రకటనల పేరుతో  రాజకీయ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే అభియోగంతో ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన  ధర్మాససం ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోల వాడకాన్ని నిషేధించింది..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  government ads  PM  President  CJI  

Other Articles